ప్రముఖ సినీనటుడు వైజాగ్‌ ప్రసాద్‌ (75) కన్నుమూశారు.  కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వైజాగ్ ప్రసాద్ మృతికి ప‌లువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయ‌న మృతి సినీ ప‌రిశ్ర‌మ‌కి తీర‌నిలోటని, ఆయ‌న ఆత్మకి శాంతి చేకూరాల‌ని, వారి కుటుంబానికి ప్ర‌గాడ సానుభూతి తెలియ‌జేస్తున్నారు. ఈయన అసలు పేరు కొర్లాం పార్వతీ వరప్రసాదరావు.


వైజాగ్‌ ప్రసాద్‌ అనేక సినిమా, టీవీ సీరియల్స్‌లలో నటించారు. 100కు పైగా తెలుగు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించారు. వైజాగ్‌ ప్రసాద్‌ 1983లో బాబాయి అబ్బాయ్‌ సినిమా ద్వారా నటుడిగా చిత్రరంగ ప్రవేశం చేశారు. తేజ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన నువ్వు-నేను చిత్రంలో మంచి గుర్తింపు వచ్చింది. జెమిని, అల్లరిబుల్లోడు, భ‌ద్ర‌, జై చిరంజీవ, నీరాజ‌నం, సుందరకాండ, రాణిగారి బంగ్లా, ఇది మా ప్రేమకథ వంటి చిత్రాల్లో వైజాగ్‌ ప్రసాద్‌ నటించారు. వైజాగ్‌ ప్రసాద్‌ కు ఆయ‌న భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.