షారుఖ్ ఖాన్ సిన్మా వల్లే ఆమె జీవితం నాశనమైందట..!
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ వల్లే తన జీవితం నాశనమైందని ఓ యువతి చాలా చిత్రమైన స్వీట్ ఆరోపణలు చేసింది.
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ వల్లే తన జీవితం నాశనమైందని ఓ యువతి చాలా చిత్రమైన స్వీట్ ఆరోపణలు చేసింది. ఇంతకీ విషయమేంటంటే.. ఆమె షారుఖ్ నటించిన "దిల్వాలే దుల్హనియా లేజాయేంగె" సినిమాకి పెద్ద ఫ్యాన్. ఆ సినిమాలో మాదిరిగానే తన జీవితంలోకి కూడా ఓ ప్రియుడు వస్తే.. షారుఖ్ ఖాన్‌లా అందంగా ప్రపోజ్ చేస్తాడని కలలు కనిందామె.
అయినా ఆమె ఆశలన్నీ అడియాసలయ్యాయి. తన జీవితంలోకి వచ్చిన వ్యక్తి షారుఖ్‌లా ఎప్పుడూ ప్రపోజ్ చేయలేదు. వారు మూడేళ్లు ప్రేమించుకొని.. ఆ తర్వాత పెళ్లి కుదిరినా కూడా.. అతను ఎప్పుడూ షారుఖ్‌లా వయోలిన్ వాయించడం గానీ.. పాట పాడి తన ప్రేమను వ్యక్తం చేయడం గానీ చేయలేదు. అందు కోసం తానే తన భర్తకు వైవిధ్యమైన రీతిలో ప్రపోజ్ చేయాలని నిశ్చయించుకుంది. అచ్చం "దిల్వాలే దుల్హనియా లేజాయేంగె" సినిమాలో మాదిరిగానే ఒక హోటల్ బుక్ చేసి, అన్నీ అనుకున్న విధంగా ప్లాన్ చేసి తన భర్తకు ఆయన బర్త్ డే రోజున సర్ ప్రైజ్ ఇచ్చింది.
మోకాళ్ల మీద కూర్చొని.. షారుఖ్ స్టైల్‌లో తన భర్తకు "ఐ లవ్ యూ" అని ప్రపోజ్ చేసింది. తను జీవితాంతం ఆయనతో కలిసి నవ్వుతూ, ఏడుస్తూ, గొడవలు పడుతూ జీవించాలని భావిస్తుందని.. అందుకోసం తననే పెళ్లి చేసుకోవాలని భావిస్తుందని ఆమె తెలిపింది. అనుకోని ఆమె సరికొత్త ప్రపోజల్‌కి ఆమెకి కాబోయే భర్త అవాక్కయ్యాడు. వెంటనే ఆమెను కౌగిలిలో బంధించి "మన పిల్లలకు మాత్రం ఇలాంటి ఫిల్మీ స్టైల్ అలవాటు చేయకుండా మంచిది" అన్నాడట.