బాలీవుడ్ బాద్ షా ..  షారుఖ్  ఖాన్ బిజీగా ఉన్నప్పటికీ ఫ్యాన్స్ కోసం కొంత సమయం కేటాయించారు. బుధవారం రోజున సాయంత్రం 'ఆస్క్ మీ ఎనీథింగ్' అంటూ ట్విట్టర్ వేదికగా అభిమానులతో సరదా సంభాషణలు చేశారు.  ఈ విధంగా ఫ్యాన్స్‌ను ఆనందోత్సాహలకు గురి చేశారు షారుక్ ఖాన్. 'ఆస్క్ మీ ఎనీథింగ్'  సెషన్ కావడంతో ఫ్యాన్స్ ... షారుక్ ఖాన్ ను అన్నింటిపైనా ప్రశ్నలు అడిగారు. ఐతే ఈ సందర్భంగా పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నలకు షారుక్ ఖాన్ కూడా సరదాగా సమాధానాలు ఇచ్చారు. ఓ అభిమాని షారుక్ ఖాన్ నివాసం ఉంటున్న 'మన్నత్' భవనంలో ఓ రూమ్ అద్దెకు కావాలని అడిగాడు. అంతే కాదు .. దానికి నెలకు అద్దె ఎంత తీసుకుంటారని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నపై స్పందించిన షారుక్. . . 30 ఏళ్ల కష్టార్జితం అంటూ సమాధానం ఇచ్చారు. షారుక్ ఖాన్ ముంబైలో ఉంటున్న నివాసం మన్నత్. సముద్ర తీరంలో ఉన్న ఈ భవనం విలువ దాదాపు 200 కోట్లు. ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన భవనాల్లో మన్నత్ కూడా ఒకటి కావడం విశేషం.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరో షారుక్ అభిమాని .. కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా దినేష్ కార్తీక్ స్థానంలో శుభ్ మన్ గిల్ కు చోటు ఎప్పుడు లభిస్తుందని ప్రశ్నించాడు. దీనికి స్పందించిన షారుక్ ..  కోల్ కతా నైట్ రైడర్స్ కోచ్ గా మిమ్మల్ని త్వరలోనే నియమిస్తారంటూ సమాధానమిచ్చారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..