తెలుగులో అర్జున్‌రెడ్డి చిత్రం గత ఏడాది విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు గానూ దర్శకుడు సందీప్‌రెడ్డికి, హీరో విజయ్‌దేవరకొండకి ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం ప్రస్తుతం హిందీలో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో డైరెక్ట్ చేసిన సందీప్‌రెడ్డి వంగానే అర్జున్ రెడ్డి హిందీకి దర్శకత్వం వహిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగులో భారీ సక్సెస్ అందుకున్న అర్జున్ రెడ్డి సినిమా హిందీ వెర్షన్‌లో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో 'భరత్ అనే నేను' హీరోయిన్ కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ సినిమాలో 90లో ఎంతో పాపులర్ అయిన ప్రభుదేవా నటించిన 'ప్రేమికుడు' చిత్రంలోని 'ఊర్వశి... ఊర్వశి టేకిటీజీ ఊర్వశి' అనే పాటను ఉంచనున్నారు. పాత పాటలోని కొన్ని రిలిక్స్ మార్చి వాడుతున్నారని కొరియోగ్రాఫర్ సంజయ్ శెట్టి వెల్లడించారు. కాగా యోయో హనీసింగ్ ఈ పాటను కంపోజ్ చేయనున్నారు. జూలైలో సినిమా షూటింగ్ ప్రారంభమైనట్టు సమాచారం. అర్జున్ రెడ్డి హిందీ వెర్షన్‌ను నిర్మాతలు అశ్విన్ వర్దే, మురద్‌ఖేతాని తెరకెక్కించబోతున్నారు.


అటు కోలీవుడ్‌లో విక్రమ్‌ తనయుడు ధృవ్‌ను హీరోగా పరిచయం చేస్తూ..దర్శకుడు బాలా తమిళ్‌లో అర్జున్‌ రెడ్డిని ‘వర్మ’ పేరుతో తెరకెక్కిస్తున్నారని తెలిసింది.