జూ.ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో రామ్ చరణ్ ఫోటో షేర్ చేసి అందర్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇటీవలి కాలంలో రాజమౌళితో కలిసి జూ.ఎన్టీఆర్, చెర్రీలు దిగిన ఫోటో అభిమానులకు కనువిందు చేసిన విషయం తెలిసిందే. ఇద్దరు స్టార్ హీరోలు ఇలా ఫ్రెండ్లీగా వ్యవహరించడం చూసి అభిమానులు సంబరాలు చేసుకున్నారు. తాజాగా జూ ఎన్టీఆర్ షేర్ చేసిన ఈ అరుదైన ఫొటో అభిమానుల్ని తెగ ఆకట్టుకుంటోంది...సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ అరుదైన ఫోటో మీరూ చూసి  ఎంజాయ్ చేయండి... 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


 


ఇటీవల జూ.ఎన్టీఆర్ పెళ్లి రోజు సందర్భంగా చరణ్‌ దంపతులు ఆయన ఇంటికి వెళ్లి వేడుకలో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా తీసిన చరణ్‌ ఫొటోను జూ ఎన్టీఆర్  ట్విటర్‌లో షేర్‌ చేశారు. అందులో చెర్రీ వెనక తారక్‌ తాతయ్య  నందమూరి తారక రామారావు ఫొటో ఉంది. చరణ్‌ లెజెండెరీ ఆలోచనల్లో ఉన్నారని జూ ఎన్టీఆర్ ఈ‌ ఫొటోకు క్యాప్షన్‌ ఇచ్చారు.



రామ్‌చరణ్‌, తారక్‌ కలిసి ఓ మల్టీస్టారర్‌కు సంతకం చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ‘బాహుబలి’ వంటి బ్లాక్‌బస్టర్‌‌‌ తర్వాత తెరకెక్కించనున్న చిత్రమిది. ఈ సినిమా ప్రీ పొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఈ చిత్రం విడుదల చేసే లోపు ఇరువురి అభిమానుల మధ్య  స్నేహపూర్వక వాతావరణం సృష్టించేందుకు  చెర్రీ, జూ.ఎన్టీఆర్ ఇలాంటి సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.