పవన్ తల్లికి శ్రీరెడ్డి క్షమాపణలు
పవన్ కల్యాణ్ తల్లికి నటి శ్రీరెడ్డి క్షమాపణలు చెప్పింది. ఎమోషన్ లో ఆమెను ఏకవచనంతో సంబోధించాను. ఆమె విషయంలో నేను చేసింది ముమ్మాటికి తప్పే..అందుకే క్షమించమని కోరుతున్నాను. పవన్ చెప్పినట్లుగా ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తా..పోలీస్ స్టేషన్ కు వెళ్లి న్యాయం కోరుతా..ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గను..ఈ విషయంలో ఎవరినైనా ఎదిరిస్తా..జీవితంలో మంచి, చెడులను చూశా..సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటానని వెల్లడించింది. తన డిమాండ్ల నెరవేరే వరకు పోరాటం విరమించను. మహిళ ఆర్టిస్టులకు గౌరవం దగ్గలన్నదే తన లక్ష్యమని శ్రీరెడ్డి వ్యాఖ్యనించారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగు ఆర్టిస్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నాని శ్రీరెడ్డి పేర్కొంది.