తెలుగు, తమిళ చిత్రాల్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుని. .  తండ్రికి తగ్గ తనయగా గుర్తింపు పొందిన హీరోయిన్ శ్రుతి హసన్. నిన్న ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా అత్యంత సన్నిహితులైన స్నేహితులతో ఈ బర్త్ డే గర్ల్ చాలా ఎంజాయ్ చేసింది. ఆమె ..  తన పుట్టిన రోజును లండన్ లో జరుపుకుంది.  లండన్ లో పుట్టిన రోజు జరుపుకున్నా అభిమానులను మర్చిపోలేదు. ప్రపంచవ్యాప్తంగా తనకు ఆన్ లైన్ లో పుట్టిన రోజు వేడుకలు చెప్పిన అభిమానులకు సోషల్ మీడియా సైట్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా కృతజ్ఞతలు తెలిపింది. అభిమానుల కోసం డ్విబీ డాన్స్ చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది. మంచి జీవితాన్నిచ్చిన అభిమానులకు థ్యాంక్స్ అంటూ ఓ ట్యాగ్ లైన్ పెట్టడం విశేషం. జీవితం ఒక్కో సంవత్సరంలో ఒక్కో విధంగా ముందుకు వెళ్తోందని .. శ్రుతి హసన్ రాసుకొచ్చింది. ఐతే జీవితంలోని అన్ని మధురానుభూతులను తాను ఆనందిస్తున్నానని తెలిపింది.



ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న శ్రుతి హసన్..  మాస్ మహారాజా రవి తేజతో నటిస్తోంది. గోపీ చంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న రవి తేజ సినిమా క్రాక్ లో కనిపించనుంది. గతేడాది లండన్ లో ఓ మ్యూజికల్ కన్సర్ట్ లోనూ శ్రుతి పాల్గొంది. అందులో గాయనిగా కొత్త ప్రయాణం ప్రారంభించింది.