వెండి తెరపై హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసిన శ్రుతి హాసన్..ఇప్పుడు రాజకీయాలపై దృష్టి మళ్లిస్తోందా అంటే ఆమె తాజా వ్యాఖ్యలను పరిశీలిస్తే ఔననే సమాధానం వస్తుంది.. ఇంతకీ రాజకీయాలపై ఆమె ఏం చెప్పిందో తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే
 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హీరోయిన్ గా తెలుగు ,తమిళ భాషల్లో అగ్రస్థానానికి చేరుకున్న  శ్రుతీ హాసన్..బాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు సాధించుకుంది. తన సినీ కెరీర్ లో అనేక హిట్ లు సొంతం చేసుకుంది. ఈ క్రమంలో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. సౌతిండియాలో మంచి ఫ్యాన్స్ కలిగిన హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న  శ్రతి ఇప్పుడు  రాజకీయాలను గురించి ప్రస్తావిస్తోంది..
 


ఓ మీడియా ఇంటర్వ్యూలో  శ్రతి హాసన్ మాట్లాడుతూ తనకు ఇప్పుడిప్పుడే రాజకీయాలపై ఆసక్తి ఏర్పడిందని చెప్పింది.  తన తండ్రి రాజకీయాల్లోకి  అడుగుపెట్టేంతవరకూ నాకు రాజకీయాల గురించి ఏమీ తెలియదు. ఇప్పుడు అవగాహన పెంచుకుని ఆయనకి  సహకరించాలని అనుకుంటున్నానని తన మనసులో మాట బయటకు చెప్పింది. 
 


ఇటీవలె శ్రతిహాసన్ తండ్రి, సీనియర్ నటుడు కమల్ హాసన్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాజకీయాల్లో ఎలాంటి పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తున్న కమల్ హాసన్ కు సపోర్ట్ గా శ్రుతిహాసన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.