సినిమాల్లో కామెడీతో నవ్వులు పంచే . . స్టార్ కమేడియన్ రాహుల్ రామకృష్ణ జీవితంలో విషాదం ఎంతో ఉంది. దీన్ని ఆయనే స్వయంగా బయట పెట్టారు. రాహుల్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ షాకింగ్ విషయాన్ని ట్వట్టర్ వేదికగా పంచుకున్నారు. తనను చిన్నతనంలోనే రేప్ చేశారంటూ .. ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. చిన్నతనంలో జరిగిన విషయం కాబట్టి.. ఎవరికి చెప్పాలో.. ఎలా చెప్పాలో ..ఇప్పటి వరకు తెలియలేదన్నారు. చిన్నప్పటి బాధ.. బాధగానే మిగిలిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఐతే ఇప్పటికైనా ఈ బాధను కొంత మందితో షేర్ చేసుకుంటే .. తనేంటో తనకు అర్థమవుతుందని తెలిపారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్టార్ కమేడియన్ రాహుల్ రామకృష్ణ ట్వీట్ పై నెటిజన్లు బాగానే స్పందించారు. ఆయనకు ధైర్యం చెబుతూ ట్వీట్లు చేశారు. ముఖ్యంగా నటుడు ప్రియదర్శ్ .. రాహుల్ ను ఓదారుస్తూ ట్వీట్ పోస్ట్ చేశారు. గతంలో జరిగిన దాన్ని ఎలాగూ మార్చలేం. కానీ 'ధైర్యంగా ఉండు' అని చెబుతూ ఆయన బాధను పంచుకున్నారు. 'నీ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నావు.. ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నావ్ మిత్రామా .. నువ్వు పోరాట యోధునివి' అంటూ ట్వీట్ చేశారు.    


నెటిజనుల ట్వీట్లపై రాహుల్ రామకృష్ణ స్పందించారు. జీవితంలో తనకు జరిగినట్లుగా ఎవరికీ జరగకూడదని చెప్పారు. చిన్న పిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తగా కాపాడుకోవాలని ట్వీట్ చేశారు. మగ పిల్లలకు చిన్నప్పటి నుంచే మంచి బుద్ధులు నేర్పించాలని పోస్టు చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..   Read Also: చిక్కుల్లో నిత్యానంద.. ఆచూకీ తెలపాలని ఇంటర్ పోల్ నోటీసులు