నటి సోనాలి బింద్రే సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్
కాన్సర్ వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్ సోనాలి బింద్రే.. న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆమె పరిస్థితి గురించి తెలుసుకునేందుకు సహచర నటులతో పాటు అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో తన ఆవేదనను తెలుపుతూ సోషల్ మీడియాలో సోనాలి ఓ ఆసక్తికర లేఖను పోస్టు చేసింది. దీంతో పాటు తన కంటిలో కాటుక పెట్టుకుంటున్న ఓ ఫొటోను షేర్ చేసింది.
సోనాలి సందేశం...
కీమో థెరపీ, సర్జరీ తర్వాత కొన్ని రోజులు చాలా కష్టమైందని చెప్పిన సోనాలి.. కనీసం నవ్వినా నొప్పి వచ్చేదని తన బాధను వ్యక్తం చేసింది. ప్రతి నిమిషం తనతో తను పోరాటం చేస్తున్నానని ..నొప్పిని భరిస్తూ ఎన్నోసార్లు రాత్రులు ఏడ్చానని బింద్రే పేర్కొంది. కొన్నిసార్లు తాను ఇక బతనేమోననే భావన కలుగుతోందని వెల్లడించింది. ఎవరికైనా ఇలాంటి చెడు రోజులు జీవితంలో కచ్చితంగా వస్తుంటాయి. దాన్ని ఎదుర్కొని సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి అని సందేశం ఇచ్చింది సోనాలి.