ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ( SP Balasubrahmanyam ) అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన ఆరోగ్యం బాగుపడాలని కోరుకున్న వాళ్లందరికీ ఆయన తనయుడు ఎస్పీ చరణ్ ( SP Charan ) కొంత ఊరటనిచ్చే వార్త చెప్పారు. తన తండ్రి బాలసుబ్రహ్మణ్యంకు తాజాగా చేసిన కరోనా పరీక్షల్లో నెగటివ్ అని తేలినట్టు ( SP Balasubrahmanyam tested negative for COVID-19 ) బాలు కుమారుడు ఎస్పీ చరణ్ ( SP Charan ) వెల్లడించారు. ఈ మేరకు తాజాగా చరణ్ ఓ వీడియో విడుదల చేశారు. ''నాన్నగారు కోలుకుంటున్నారు. ఆయనకు కరోనా నెగటివ్ వచ్చింది. కాకపోతే ప్రస్తుతానికి వెంటిలేటర్‌పైనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు'' అని చరణ్ ఈ వీడియోలో పేర్కొన్నారు. Also read : Turtle hi-fives alligator: మొసలికి హై-ఫైవ్ ఇచ్చిన తాబేలు

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

#spb health update 7/9/20

Posted by Charan Sripathi Panditharadhyula on Monday, September 7, 2020

''పెళ్లి రోజు సందర్భంగా అమ్మానాన్నలు ఇద్దరూ ఆసుపత్రిలోనే వేడుకలు కూడా జరుపుకున్నారు అని చెప్పిన చరణ్.. నాన్న రాయగలుగుతున్నారు. ఐపీఎల్ మ్యాచుల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు'' అని ఈ వీడియో ద్వారా బాలు అభిమానులకు తెలియజేశారు. ఆగస్టు 5న కరోనా పాజిటివ్ అని తేలిన అనంతరం నుంచి ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఆర్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. త్వరలోనే బాలు అనారోగ్యం నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావాలని మనం కూడా మనస్పూర్తిగా కోరుకుందాం. Also read : Adipurush: సైఫ్ అలీ ఖాన్ రావణుడి వేషం వెనుకున్నది ఎవరో తెలుసా ?