Anukunnavanni Jaragavu Konni: `అనుకున్నవన్నీ జరగవు కొన్ని` మూవీ రివ్యూ.. క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే..?
Anukunnavanni Jaragavu Konni Movie Review and Rating: హీరోహీరోయిన్స్‌ను కాల్ బాయ్, కాల్ గర్ల్‌గా చూపిస్తూ.. క్రైమ్ కామెడీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన మూవీ `అనుకున్నవన్నీ జరగవు కొన్ని`. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే..?
Anukunnavanni Jaragavu Konni Movie Review and Rating: శ్రీరామ్ నిమ్మల, కలపాల మౌనిక హీరోహీరోయిన్స్‌గా జి.సందీప్ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన మూవీ 'అనుకున్నవన్నీ జరగవు కొన్ని'. పోసాని కృష్ణ మురళి, బబ్లు మాయ్య, కిరీటి, స్నేహ మాధురి, సోనియా చౌదరి, గౌతమ్ రాజు, మిర్చి హేమంత్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సంగీత గిడియన్ కట్ట అందించగా.. ఎడిటర్‌గా కేసీబీ హరి వ్యవహరించారు. శ్రీ భరత్ ఆర్ట్స్‌పై నిర్మితమైన ఈ సినిమా నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులకు నచ్చిందా..? ఓసారి రివ్యూ చూస్తే..
కథ ఏంటంటే..
హీరో శ్రీ రామ్ నిమ్మల(కార్తీక్) కాల్‌బాయ్‌గా.. హీరోయిన్ కలపాల మౌనిక (మధు) కాల్ గర్ల్‌గా పనిచేస్తుంటారు. ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో అనుకున్నవన్నీ జరగవు కొన్ని మూవీని డైరెక్టర్ తెరకెక్కించారు. కార్తీక్, మధు తమ జీవితాలను ఎలా మలుచుకున్నారు..? ఎందుకు కాల్‌బాయ్, కాల్ గర్ల్‌గా మారారు..? జీవితంలో అనుకొని సంఘటనలు ఎదుర్కొని ఎలా ఇబ్బందులు పడ్డారు..? వాటి నుంచి ఎలా బయటకు వచ్చారనేదే ఈ సినిమా కథ. పోసాని కృష్ణమురళి బబ్లు మాయగా కీలక పాత్ర పోషించారు. ఆయన పాత్ర ప్లస్ పాయింట్‌గా మారింది. సినిమా ఆద్యంతం నవ్విస్తూ.. మంచి అనుభూతిని అందిస్తుంది.
విశ్లేషణ: ప్రొడ్యూసర్‌గా.. డైరెక్టర్‌గా రెండు బాధ్యతలు చేపట్టి.. తాను అనుకున్న కథను అనుకున్నట్లుగానే తెరపైన చూపించాడు సందీప్. ద్వితీయార్థంలో పోసాని కృష్ణమురళి పాత్ర ఆడియన్స్‌ను నవ్విస్తుంది. ఆయన నటన సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. హీరోగా శ్రీరామ్ నిమ్మల ఆడియన్స్‌ను మెప్పించాడు. హీరోయిన్ కలపాల మౌనిక యాక్టింగ్ చాలా బాగుంది. ఇతన నటీనటులు తమ పరిధి మేరకు పాత్రలకు న్యాయం చేశారు. గిడియన్ కట్ట అందించిన సంగీతం కొత్తగా అనిపిస్తుంది. ఎడిటర్ కేసీబీ హరి పనితీరు చాలా బాగుంది. హీరోహీరోయిన్స్‌ను కాల్‌బాయ్‌గా.. కాల్ గర్ల్‌గా చూపిస్తూ సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కించడం మెచ్చుకోదగినదే.క్రైమ్, కామెడీని ఎక్కువగా ఇష్టపడే వాళ్లకి ఈ మూవీ కచ్చితంగా నచ్చుతుంది.
ప్లస్ పాయింట్స్: హీరో, హీరోయిన్‌ను ఎన్నడూ చూడని విధంగా కొత్త కాన్సెప్ట్‌తో చూపించడం.
గ్రాండ్‌గా ఎక్కడ కాంప్రమైజ్ నిర్మాణ విలువలు
పోసాని కృష్ణ మురళి కామెడీ
నెగిటివ్స్: ఫస్ట్ హాఫ్‌లో అక్కడక్కడ కొన్ని సాగదీత సీన్స్
రేటింగ్ : 2.7/5
Also Read: IND Vs SL Highlights: శ్రీలంకకు టీమిండియా అదిరిపోయే పంచ్.. సెమీస్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ..!
Also Read: Skin Care Tips: ఈ పదార్ధాలు దూరం చేయకుంటే మీ చర్మం కాంతి విహీనంగా అందవికారంగా మారడం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook