బాలీవుడ్ నటి దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఈ రోజు జాతీయ చలనచిత్ర అవార్డులకు తన తల్లి చీర ధరించి వచ్చారు. తన తండ్రి, సోదరితో కలిసి ఆమె రాష్ట్రపతి చేతులమీదుగా శ్రీదేవికి దక్కాల్సిన అవార్డును అందుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"మామ్" చిత్రంలో నటనకు గాను శ్రీదేవికి జాతీయ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. 7 జూన్ 2017 తేదిన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 
"మామ్" చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించారు.


గిరీష్ కోహ్లీ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చగా.. రవి ఉద్యవర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో శ్రీదేవితో పాటు నవాజుద్దీన్ సిద్దీఖీ, అక్షయ్ ఖన్నా, సజల్ ఖాన్ ఇతర పాత్రలు పోషించారు. "మామ్" చిత్రంలో నటనకు గాను శ్రీదేవి విమర్శకుల ప్రశంసలు కూడా పొందారు.