చిత్రం పేరు : తంతిరం
నటీనటులు : శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ, అవినాష్ ఎలందూర్, తదితరులు
బ్యానర్ : సినిమా బండి ప్రొడక్షన్స్
కథ : షాబాజ్ ఏం ఎస్ , వినీత్ పొన్నూరు
కెమెరా మాన్ మరియు ఎడిటర్ : వంశీ శ్రీనివాస్ ఎస్
సంగీతం : అజయ్ ఆరాసాడా
లిరిక్స్ : భాస్కరభట్ల
దర్శకుడు : ముత్యాల మెహర్ దీపక్
నిర్మాత : శ్రీకాంత్ కాండ్రగుల (SK)


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీమతి కాండ్రగుల లావణ్య రాణి సమర్పణలో సినిమా బండి ప్రొడక్షన్స్  పతాకంపై శ్రీకాంత్ గుర్రం మరియు ప్రియాంక శర్మ హీరో హీరోయిన్ గా నటించిన చిత్రం "తంతిరం". ముత్యాల మెహర్ దీపక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి  శ్రీకాంత్ కాండ్రగుల నిర్మాత. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీ గా ఉంది. అయితే ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్.


Also Read:  Interesting Facts About CIBIL: ఏయే సందర్భాల్లో సిబిల్ స్కోర్ పడిపోతుందో తెలుసా ?


ఈ సందర్భంగా నిర్మాత శ్రీకాంత్ కాండ్రగుల మాట్లాడుతూ "మా తంతిరం చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. ఇది హారర్ అంశాలతో కూడిన కుటుంబ కథ చిత్రం. భార్య భర్తల మధ్య ఒక ఆత్మ ప్రవేశిస్తే వారి దాంపత్య జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అంటే మా "తంతిరం" చిత్రం చూడాల్సిందే. మా చిత్రం కేరళ ప్రాంతాల్లో అందమైన లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకున్నాము, షూటింగ్ అంతా పూర్తి అయ్యింది. ప్రస్తుతానికి నిర్మాణాంతర పనుల్లో బిజీ గా ఉంది. ఈ రోజు మా చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసాం. త్వరలోనే టీజర్, ట్రైలర్ తో మీ ముందుకు వస్తాం" అని తెలిపారు.


Also Read: Oppo A58 Price: Oppo A58 స్మార్ట్‌ ఫోన్‌ కేవలం రూ. 549లకే..ఎలా కొనాలో ఇలా తెలుసుకోండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి