రాజమౌళి తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. కరోనావైరస్ ( Coronavirus ) పాజిటివ్ సోకిన అనంతరం రాజమౌళి కుటుంబం మొత్తం హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా 2 వారాల పాటు క్వారంటైన్ ( Home quarantine ) పూర్తి చేసుకున్న రాజమౌళి.. తమ కుటుంబం మొత్తం కరోనా పరీక్షలు చేయించుకున్నామని, అందరికీ ఈ పరీక్షల్లో నెగటివ్ అని తేలింది అని రాజమౌళి తెలిపాడు. రాజమౌళి ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. Also read : COVID-19: 24 గంటల్లో కరోనాతో 93 మంది మృతి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనాతో కోలుకున్న వారు ప్లాస్మా దానం ( Plasma donation ) చేస్తే.. కరోనాతో బాధపడే వారికి ఇంజెక్ట్ చేసి బతికించుకునే అవకాశం ఉండటంతో తాము కూడా ప్లాస్మా దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఐతే శరీరంలో యాండీబాడీలు వృద్ధి చెందాయో లేదో తెలియాలంటే ఇప్పటి నుంచి మరో మూడు వారాల పాటు వేచిచూడాల్సిందేనని డాక్టర్లు తెలిపారని రాజమౌళి ఈ ట్వీట్ లో పేర్కొన్నాడు.



 


రాజమౌళి అభిమానులు ఆర్ఆర్ఆర్ మూవీ ( RRR movie ) కోసం ఎదురుచూస్తున్న ప్రస్తుత తరుణంలో ఆయనకు కరోనా సోకిందని తెలిసిన మరుక్షణం అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కానీ తాజాగా రాజమౌళి కరోనా నుంచి కోలుకున్నారని తెలియడంతో అందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. Also read : Rhea Chakraborty: సుశాంత్ గాళ్‌ఫ్రెండ్ కాల్ డేటాలో రానా, రకుల్, అమీర్ ఖాన్ పేర్లు