`సై రా` ఫస్ట్ లుక్కు ముహూర్తం ఖరారు!
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ` సై రా నరసింహా రెడ్డి`.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ' సై రా నరసింహా రెడ్డి'. ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం చిరు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య అమితాబ్ సోషల్ మీడియా ద్వారా సై రా షూటింగ్ ఫోటోలు షేర్ చేశాడు. ఆ ఫోటోలతో అమితాబ్, నయనతార, చిరు లుక్ లు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో 'సై రా' ఫస్ట్ లుక్ ను మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22న రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది.
'సై రా' చిత్రంలో చిరంజీవితో పాటు నయనతార, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ లో రాం చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి విడుదల కానుంది. చిరంజీవి 62వ పుట్టినరోజున తన అభిమానులకు కానుకగా రాం చరణ్ తేజ, 22 ఆగష్టు 2017న ఈ చిత్రం మోషన్ పోస్టర్ విడుదల చేశారు.