మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సైరా నర్సింహా రెడ్డి మూవీ టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది. మామూలుగానే మెగాస్టార్ చిరు సినిమా అంటే అభిమానుల్లో భారీ అంచనాలుంటాయి. అందులోనూ తెలుగు నేలపై స్వాతంత్య్ర ఉద్యమాలకు ఊపిరిలూదిన తొలి తరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో సైరా నర్సింహా రెడ్డి సినిమాపై ఇంకాస్త ఎక్కువ అంచనాలే ఉన్నాయి. అందుకే ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలువుతుందా అని ఎదురుచూసే అభిమాన బలగం కూడా అంతే ఎక్కువగానే ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"179515","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఇక టీజర్ విడుదల తేదీ విషయానికొస్తే, అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా సినిమాను విడుదల చేయాలనుకుంటున్న మేకర్స్.. ఆగస్టు 20న సైరా టీజర్‌ను విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే అభిమానులకు స్వాతంత్య్ర దినోత్సం కానుకగా ఇటీవల విడుదల చేసిన మేకింగ్ వీడియోకు భారీ స్పందన కనిపిస్తుండగా ఇక ఇప్పుడు అందరి దృష్టి సైరా టీజర్‌పై పడింది. స్టైలిష్ డైరెక్టర్‌గా పేరున్న సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను కొనిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగాపవర్ స్టార్ రాంచరణ్ నిర్మిస్తున్నాడు.