హాలీవుడ్ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కొత్త సినిమా "రేస్ 3" విడుదల అవుతున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలపాలని భావించారు. అయితే అలా విషెస్ చెబుతున్న సందర్భంగా సల్మాన్‌కు బదులు బాబీ డియోల్ ఫోటో పోస్టు చేయడంతో.. సల్మాన్ అభిమానులందరూ ఆ హాలీవుడ్ హీరోపై విరుచుకుపడ్డారు. రెమో డిసౌజా దర్శకత్వం వహిస్తున్న  "రేస్ 3" చిత్రంలో సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, బాబీ డియోల్, జాక్వలిన్ ఫెర్నాండెజ్, డైసీ షా తదితరులు నటిస్తున్నారు. సల్మాన్ ఖాన్ కూడా ఈ చిత్రానికి సంబంధించి ఒకానొక నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.


సోనాక్షి సిన్హా ఇదే చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో నటిస్తోంది. 15 జూన్, 2018 తేదిన ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే సిల్వెస్టర్
స్టాలోన్ పోస్టు చేయడానికి ఓ రోజు ముందే సల్మాన్ ఖాన్, స్టాలోన్ నటిస్తున్న క్రీడ్ 2 చిత్రానికి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. మొత్తానికి సల్మాన్ పొరపాటు పడి, బాబీ డియోల్ ఫోటో పోస్టు చేసినా.. ఆ పోస్టు వైరల్ అయ్యి.. సినిమాకి మాత్రం మంచి పబ్లిసిటీయే వచ్చిందని అంటున్నారు బాలీవుడ్ ఫ్యాన్స్.