తమన్నా అమెరికా డాక్టర్‌ను పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వీరి నిశ్చితార్థం జరగనుందని, ఆపై పెళ్లి చేసుకోనున్నారనే టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వార్తల్ని తమన్నా ట్విటర్‌ ద్వారా ఖండించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్నారైని తానూ పెళ్లి చేసుకోనున్నట్లు వచ్చిన కథనాలు అవాస్తవమని మిల్కీ బ్యూటీ తమన్నా వివరణ ఇచ్చారు. ‘ఓ రోజు నటుడని, మరో రోజు క్రికెటరని, ఇప్పుడు వైద్యుడని వార్తలు వస్తున్నాయి. ఈ వదంతులు ఎక్కడి నుంచి వస్తాయో నాకు ఏ మాత్రం అర్థం కావడం లేదు. నా వ్యక్తిగత జీవితం గురించి ఆధారాలు లేకుండా వార్తలు రాస్తే ఒప్పుకోను. నేను సింగిల్‌గా చాలా సంతోషంగా ఉన్నా. నా తల్లిదండ్రులు పెళ్లి కొడుకు కోసం వెతకడం లేదు.' అని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నప్పుడు స్వయంగా తెలియజేస్తానని తమన్నా పేర్కొన్నారు. 



 


బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ’క్వీన్’ కి రీమేక్‌గా తెరకెక్కుతున్న ‘దటీజ్ మహాలక్ష్మి’లో తమన్నా ప్రస్తుతం నటిస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు వెర్షన్‌లో తమన్నా లీడ్ రోల్‌లో నటిస్తోంది.