COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Hero Vikram Health Update : తమిళ స్టార్ హీరో విక్రమ్ కు గుండెపోటు వచ్చిందని తమిళ మీడియా వర్గాల నుంచి తొలుత సమాచారం బయటకు వచ్చింది. చెన్నై మీడియా వర్గాల సమాచారం మేరకు విక్రమ్ స్థానిక కావేరి ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతాన్ని ఆయనకు వైద్య బృందం చికిత్స చేస్తుంది. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన బులెటిన్ కావేరి వైద్యులు విడుదల చేయలేదు కానీ విక్రమ్ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని చెప్పినట్లు ప్రచారం జరిగింది. కొన్ని పరీక్షలు చేస్తున్నామని అవి చేసిన తర్వాత సాయంత్రం లోగా డిశ్చార్జ్ కూడా చేస్తామని వారు చెప్పినట్లు మీడియా ద్వారా వెల్లడయింది.


విక్రమ్ కు ఏమి కాకూడదని ఆయన అభిమానులు ప్రార్ధనలు చేస్తున్న క్రమంలో విక్రమ్‌కు గుండెపోటు వచ్చిందని, అందువల్ల ఆసుపత్రిలో చేరారని పేర్కొన్న అన్ని వార్తలకు, ప్రచారాలకు విరుద్ధంగా, ఆయన పీఆర్ టీమ్ ఆసక్తికర ప్రకటన చేసింది. ఆయనకు కేవలం హై ఫీవర్ వల్లే హాస్పిటల్ లో చేరారని, ఇప్పుడు ఆయన బాగానే ఉన్నారని వెల్లడించారు. విక్రమ్ త్వరలో డిశ్చార్జ్ అవుతారని కూడా అయన వెల్లడించారు. అయితే కావేరి హాస్పిటల్ బులెటిన్ ప్రకారం ఛాతీ ఇబ్బందులతో విక్రమ్ హాస్పిటల్ కు వచ్చిన మాట వాస్తవమే కానీ అది కార్డియాక్ అరెస్ట్ కాదని వెల్లడించారు. ఆయన బాగానే ఉన్నారని త్వరలో డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు. 


ఇక విక్రమ్ ఈ ఏడాది తన రెండు సినిమాల రిలీజ్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. అజయ్ జ్ఞానముత్తుతో చేసిన కోబ్రా, మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. కోబ్రా ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రాగా, పొన్నియిన్ సెల్వన్ సెప్టెంబర్ 30న విడుదల కానుంది. ఇదిలా ఉంటే విక్రమ్ తొలిసారిగా పా.రంజిత్ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. నిర్మాత జ్ఞానవేల్ రాజా తన తాజా ఇంటర్వ్యూలలో విక్రమ్‌తో తన తదుపరి ప్రాజెక్ట్ భారీ స్థాయిలో నిర్మించబడుతుందని, భారతదేశపు అతిపెద్ద 3D చిత్రంగా ఉంటుందని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌ను పాన్-ఇండియన్ చిత్రంగా రూపొందిస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు.


విడుదల ప్లాన్ చేస్తున్న అన్ని భాషల్లో సినిమాను మరింత ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్ళడానికి ఆయా భాషలకు చెందిన నటీనటులను ఎంపిక చేస్తున్నామని అన్నారు. ఇక  పొన్నియన్ సెల్వన్ టీజర్ రిలీజ్ జరుగుతుంది కానీ ఆయన ఈ వేడుకకు హాజరు కావడం లేదని అంటునారు. విక్రమ్ తమిళం,  తెలుగు,  హిందీ సహా పలు భాషల్లో నటించారు. ఆయన చివరిగా మహాన్ అనే సినిమాలో కనిపించారు. అది ఆమెజాన్ వేదికగా విడుదలైంది.   


Also Read: Sai Pallavi: కాశ్మీరీ ఫైల్స్ కామెంట్స్ మీద సాయి పల్లవికి హైకోర్టు షాక్


Also Read: James Caan Death: హాలీవుడ్‌లో విషాదం.. గాడ్ ఫాదర్ స్టార్ జేమ్స్ కాన్ కన్నుమూత



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook