దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్‌కు కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. దేశంలో అత్యధికంగా విక్రయమౌతున్న ఎస్‌యవీల్లో టాటా నెక్సాన్ మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త స్ట్రాటెజీ అవలంభిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కార్ల విక్రయాల్లో టాటా సంస్థ ఇప్పుడు మూడవ స్థానంలో ఉంది. రెండవ స్థానంలో ఉన్న హ్యుండయ్‌కు గట్టి పోటీ ఇస్తోంది. ఎస్‌యూవీ విక్రయాల్లో టాటా నెక్సాన్‌‌దే అగ్రస్థానంగా ఉంది. అదే సమయంలో చిన్న ఎస్‌యూవీ విక్రయాల్లో కూడా టాటా పంచ్‌కు క్రేజ్ పెరుగుతోంది. ఇటీవలే టాటా సంస్థ టాటా పంచ్ ధరను పెంచింది. టాటా పంచ్ ధర ఇప్పుడు 12 వేలు పెరగడం విశేషం. టాటా పంచ్ ఎస్‌యూవీ ప్రారంభ ధర ఇప్పుడు 6 లక్షల రూపాయలైంది. టాటా పంచ్ కొనాలని ఆలోచిస్తుంటే మీకిదే మంచి అవకాశం. డౌన్ పేమెంట్, ఈఎంఐ వివరాలు ఇలా ఉన్నాయి..


లక్ష చెల్లించి టాటా పంచ్ తీసుకెళ్లే అవకాశం


టాటా పంచ్ బేసిక్ వేరియంట్ ఆన్ రోడ్ ధర 6.60 లక్షల రూపాయలుంది. మీరు 1 లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ చెల్లించి లోన్ కాలాన్ని 1-7 ఏళ్ల వరకూ ఎంచుకోవచ్చు. బ్యాంకు వడ్డీ 10 శాతం, లోన్ కాలం 5 ఏళ్లైతే ఈఎంఐ ఎంత ఉంటుందో తెలుసుకుందాం..


5 ఏళ్ల లోన్ వ్యవధి ఉండి వడ్డీ 10 శాతమై..డౌన్ పేమెంట్ 1 లక్ష రూపాయలు చెల్లిస్తే ఈఎంఐ నెలకు 11,900 రూపాయలుంటుంది. అంటే 5 ఏళ్లకు లోన్ ఎమౌంట్ 5,60,546 రూపాయలు. మొత్తం పూర్తయ్యాక మీరు అదనంగా 1.5 లక్షల రూపాయలు చెల్లించినట్టవుతుంది. 


ఇంజన్, ఫీచర్లు ఇలా


టాటా పంచ్‌లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఇంజన్‌లో 5 స్పీడ్ మ్యాన్యువల్, 1 ప్రత్యామ్నాయ 5 స్పీడ్ ఎంటీ అనుసంధానమై ఉంటాయి. ఇందులో త్వరలో సీఎన్జీ వేరియంట్ కూడా లభిస్తుంది. 


ఇక ఫీచర్ల గురించి పరిశీలిస్తే..ఇందులో 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, ఆటో ఎయిర్ కండీషనింగ్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, కనెక్టెడ్ కారు టెక్నాలజీ, క్రూయిజ్ కంట్రోల్ ఉంటాయి. టాటా పంచ్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో వస్తోంది. సేఫ్టీ కోసం ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ , ఈబీడీతో ఏబీఎస్, రేర్ డీఫాగర్, రేర్ పార్కింగ్ సెన్సార్, రేర్ వ్యూ కెమేరా ఉన్నాయి.


Also read: RBI Updates: జీ 20 దేశాల యాత్రికుల యూపీఐ చెల్లింపులకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook