OTT Releases This Week in Telugu: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన రావణాసుర, కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన మీటర్ సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఇక ఈ రెండు సినిమాలకు మిక్స్డ్ రివ్యూస్ వస్తూ ఉండగా ప్రేక్షకులు మాత్రం ధియేటర్లకు క్యూ కడుతున్నారు. అయితే మరోపక్క ఓటీటీలో కూడా భారీ ఎత్తున సినిమాలు వెబ్ సిరీసులు రిలీజ్ అవుతున్నాయి. ఇందులో తెలుగు సినిమాలు ఎక్కువగా లేనప్పటికీ కొన్ని డబ్బింగ్ సినిమాలు మాత్రం ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నా కానీ అందరి దృష్టి మలయాళంలో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి భారీ లాభాలు తెచ్చిపెట్టిన రోమాంచం మీద పడింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా తెలుగు ట్రైలర్ కూడా సినిమా మీద ఆసక్తిని పెంచేయగా ఈ సినిమాతో పాటు రంగమార్తాండ, ప్రణయ విలాసం, బుర్కా వంటి ఇతర సినిమాలు కూడా తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. అలాగే వివిధ భాషలకు చెందిన వెబ్ సిరీస్ లు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి.


ఈ నేపద్యంలో ఈ వారం అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, ZEE5, హాట్‌స్టార్, సోనీ లివ్ మరియు ఇతర OTT ప్లాట్‌ఫారమ్‌లలోకి ఏయే సినిమాలు వచ్చాయో చూద్దాం.  అమెజాన్ ప్రైమ్ వీడియోలో రంగమార్తాండ అందుబాటులో ఉంది. మలయాళ హారర్ కామెడీ బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ రోమాంచం ఇప్పుడు డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది. తమిళ చిత్రం అయాతి ZEE5లో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంది. ఇక ఆహా వీడియో యాప్ లో బుర్కా అనే తెలుగు డబ్బింగ్ సినిమా రిలీజ్ అవుతుంది.. తెలుగువారికి పరిచయం లేని నటీనటులే అయినా సినిమా ఆసక్తికరంగా ఉంటుందని ఆహా చెబుతోంది. 


Also Read: Where is Pushpa: కట్టప్ప మిస్టరీలా పుష్ప ఎక్కడ? సుక్కూ ప్లానింగ్ అదుర్స్?


ఓటీటీ వారీగా చూస్తే 
డిస్నీ ప్లస్ హాట్ స్టార్
డేవ్ సీజన్ 3 ఇంగ్లిష్ సిరీస్, టైనీ బ్యూటిఫుల్ థింగ్స్ – ఇంగ్లీష్ సిరీస్ స్ట్రీమ్ అవనున్నాయి. 
నెట్ ఫ్లిక్స్
బీఫ్ అనే ఇంగ్లిష్ సిరీస్, ఇన్ రియల్ లవ్ అనే హిందీ సిరీస్, చుపా అనే ఇంగ్లిష్ మూవీ, ఓహ్ బెలిండా అనే ఇంగ్లిష్ మూవీ, ట్రాన్స్ అట్లాంటిక్ అనే ఇంగ్లిష్ సిరీస్, హంగర్ అనే థాయ్ సినిమా రిలీజ్ అవుతున్నాయి. 
అమెజాన్ ప్రైమ్
జూబ్లీ అనే హిందీ సిరీస్ తో పాటు మహేషుమ్ మారుతీయం అనే మలయాళ మూవీ
సోనీ లివ్
చష్మే బహద్దర్ అనే మరాఠీ మూవీ 
Also Read: Ravanasura Leaked Clip: కంచం ముందుకు.. మంచం మీదకు ఆడపిల్లలు రావాల్సిందే.. లీక్ద్ వీడియోలో రవితేజ అరాచకం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook