హైదరాబాద్: తెలుగు టీవీ యాంకర్ శాంతి అనుమానాస్పదంగా మృతి చెందారు. యాంకర్‌‌గా పనిచేస్తూనే టీవీ సీరియల్స్‌లో నటిస్తున్న శాంతి ఇవాళ గురువారం ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఇంజనీర్స్ కాలనీలోని తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించారు. సమాచారం అందుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు.. హుటాహుటిన ఆమె నివాసానికి చేరుకుని ఘటనస్థలాన్ని పరిశీలించారు. శాంతి మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శాంతి ఆత్మహత్య చేసుకుందా లేక ఎవరైనా ఆమెని హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. శాంతి మొబైల్ ఫోన్‌ని స్వాధీనం చేసుకుని మరింత సమాచారం కోసం ఇరుగుపొరుగు వారి వద్ద వివరాలు రాబడుతున్నారు. అంతేకాకుండా ఆమె నివాసం సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని సైతం పరిశీలిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యాంకర్ శాంతి మృతదేహాన్ని పోస్టుమార్టం పంపించిన పోలీసులు.. పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేట్టనున్నట్టు తెలిపారు. శాంతి మృతిపై బుల్లితెర ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. శాంతి అసలు పేరు విశ్వశాంతి.