థియేటర్లు బంద్.. నెట్టింట్లో సినిమా..!!
`కరోనా వైరస్` ప్రభావం ప్రపంచ సినిమా పరిశ్రమపై విపరీతంగా పడింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే షూటింగ్ లు ఆగిపోయాయి. నిర్మాణం పూర్తి చేసుకున్న సినిమాలు కూడా విడుదలకు నోచుకోని పరిస్థితి నెలకొంది.
'కరోనా వైరస్' ప్రభావం ప్రపంచ సినిమా పరిశ్రమపై విపరీతంగా పడింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే షూటింగ్ లు ఆగిపోయాయి. నిర్మాణం పూర్తి చేసుకున్న సినిమాలు కూడా విడుదలకు నోచుకోని పరిస్థితి నెలకొంది.
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూసివేసే ఉన్నాయి. ఇప్పట్లో తిరిగి తెరుచుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో
నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇప్పుడు సినిమా నిర్మాతలు నష్టాల నుంచి వీలైనంత త్వరగా బయటపడేందుకు ఆన్ లైన్ విడుదలపై ఆధారపడుతున్నారు. అంటే సంప్రదాయ థియేటర్లలో సినిమాను విడుదల చేయడం కాకుండా సినిమాలను డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా విడుదల చేయడం అన్నమాట. దీన్నే OTT అని పిలుస్తారు. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థల ద్వారా సినిమాలు విడుదలవుతాయన్నమాట.
ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ద్వారా పలు సినిమాలు విడుదల చేసేందుకు భారత సినీ నిర్మాతలు సిద్ధమవుతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ నుంచి పలు సినిమాలు విడుదలకానున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖుర్రానా సినిమా 'గులాబో సితాబో' అమెజాన్ ప్రైమ్‌లో రిలీజయ్యేందుకు రెడీ అయింది. ఈ సినిమాను జూన్ 12న విడుదల చేయనున్నారు.
[[{"fid":"185698","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
అటు తమిళ, తెలుగు, కన్నడ, మళయాల సినిమాలు కూడా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానున్నాయి. తద్వారా వచ్చే మూడు నెలల వరకు ఆయా చిత్రాలకు సంబంధించిన విడుదల తేదీలు నిర్ణీతమయ్యాయి. తమిళంలో జ్యోతిక నటించిన 'పూన్మగళ్ వందల్' లీగల్ డ్రామా చిత్రం మే 29న అమేజాన్ ప్రైమ్‌లో విడుదలకానుంది. అలాగే కీర్తి సురేష్ నటించిన 'పెంగ్విన్' సినిమా తమిళ, తెలుగు భాషల్లో జూన్ 19న విడుదల కానుంది. మరోవైపు కన్నడ చిత్రాలు 'లా', 'ఫ్రెంచ్ బిర్యానీ' వరుసగా జూన్ 26, జులై 24న రిలీజ్ కానున్నాయి. అటు బాలీవుడ్ లో విద్యాబాలన్ నటించిన 'శకుంతల దేవీ' సినిమా విడుదల తేదీ ఖరారు కావాల్సి ఉంది.
వచ్చే మూడు నెలల వరకు అమెజాన్ ప్రైమ్‌లో సినిమాలు విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. మొత్తంగా OTT ద్వారా ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో ఒకేసారి సినిమాలు ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తాయి. మరోవైపు హాలీవుడ్ సినీ నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
ఐతే ఆన్ లైన్ సినిమాలను థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే తమిళ చిత్ర పరిశ్రమలో థియేటర్లు, మల్టీప్లెక్సుల యజమానుల అసోసియేషన్ హీరో సూర్యను తమిళ చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరిస్తామని బెదిరించారు. జ్యోతిక నటించిన 'పూన్మగళ్ వందల్' సినిమాను ఆయన OTTలో రిలీజ్ చేసేందుకు ముందుకు రావడమే ఇందుకు కారణం. 'పూన్మగళ్ వందల్' చిత్రానికి జ్యోతిక భర్త హీరో సూర్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..