జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం 'అరవింద సమేత'. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. సినిమా టీజర్ ప్రకటనలో భాగంగా మూవీ యూనిట్ రిలీజ్ చేసిన ఓ స్టిల్..సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అరవింద సమేత టీజర్‌ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నారని తెలిసిందే. కానీ ఇప్పుడు ఏ టైంలో రిలీజ్ చేస్తున్నామో అని కూడా చెప్పింది మూవీ యూనిట్. జెండావందనం అనంతరం ఆగస్టు 15 ఉదయం 9 గంటలకు అరవింద సమేత టీజర్ విడుదలకానుందని చిత్రబృందం తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తారక్, త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న తొలి సినిమా ఇదే. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రెండు డిఫరెంట్ షేడ్స్‌లో ఎన్టీఆర్ కనిపిస్తాడట. ముఖ్యంగా ఎన్టీఆర్‌ను ఎలివేట్ చేసే షాట్స్ ఆయన అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటాయని మూవీ యూనిట్ చెబుతోంది.


ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. కీలక పాత్రల్లో జగపతిబాబు, నాగబాబు తదితరులు నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్‌ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. అక్టోబర్‌లో 'అరవింద సమేత' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.