నందమూరి బాలకృష్ణ బర్త్ డే ఈ రోజు. ఈ రోజు తన58 వ పుట్టిన రోజును అభిమానులు గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఈ సెలె బ్రేషన్స్ కి తోడు దర్శకుడు క్రిష్ రిలీజ్ చేసిన పోస్టర్ నందమూరి అభిమానుల్లో వైబ్రేషన్స్  క్రియేట్ చేస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాలయ్య 100 వ చిత్రం ‘గౌతమీ పుత్ర శాతకర్ణీ’ సినిమాతో గ్రాండ్ సక్సెస్ ని సొంతం చేసుకున్న క్రిష్, NTR బయోపిక్ ని తెరకెక్కించే ప్రాసెస్ లో ఉన్నాడు. అయితే బాలయ్య బర్త్ డే రోజు, NTR  వేసిన డిఫెరెంట్ గెటప్స్ తో పాటు,  బాలయ్య కరియర్ బిగినింగ్ లో NTR బాలయ్య మేకప్ కు మెరుగులు దిద్దుతున్న స్టిల్ తో , బర్త్ డే విషెస్ ని అందజేస్తూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.
 
అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ బయోపిక్ లో 60 గెటప్పులలో కనిపించనున్నాడు బాలయ్య. ఓ వైపు NTR  లైఫ్ లోని అద్భుతమైన ఘట్టాలతో పాటు, మరోవైపు బాలయ్య నట విశ్వరూపాన్ని ఎలివేట్ చేయనున్న ఈ సినిమా సెట్స్  పైకి రాకముందు నుండే ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.


రీసెంట్ గా పైసా వసూల్ సినిమాతో కంప్లీట్ మాస్ గెటప్ లో ఎంటర్ టైన్ చేసిన బాలయ్య , తన కరియర్ లో ఏ సినిమా చేసినా, దానికో ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడీ బయోపిక్  లో  తన తండ్రిలా సిల్వర్ స్క్రీన్ పైఆయన వైభవాన్ని కళ్ళకు  కట్టినట్టు చూపించి, NTR ఫ్యాన్స్ ని  మెస్మరైజ్ చేసే ప్రాసెస్ లో బాలయ్య మరెన్నో హైట్స్ కి రీచ్ అవ్వాలని కోరుకుంటూ బర్త్ డే విషెస్ ని అందజేస్తుంది జీ సినిమాలు.


 


@ జీ ిసినిమాలు