Nindha Movie Poster: అదిరిపోయిన వరుణ్ సందేశ్ ‘నింద’ ఫస్ట్ లుక్ పోస్టర్.. ఆ వ్యక్తి ఎవరు..?
Varun Sandesh Ninda Movie: వరుణ్ సందేశ్ లేటెస్ట్ మూవీ `నింద` లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీలో వరుణ్ సందేశ్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పోస్టర్‌ను డిఫరెంట్‌గా డిజైన్ చేశారు. మే 15న టీజర్‌ను విడుదల చేయనున్నారు.
Varun Sandesh Ninda Movie: నింద మూవీతో ఆడియన్స్‌ను పలకరించేందుకు రెడీ అవుతున్నారు హీరో వరుణ్ సందేశ్. నిజ జీవితంలో సంఘటలన ఆధారంగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రాజేష్ జగన్నాథం దర్శకత్వం వహిస్తూ ఆయనే స్వయంగా నిర్మిస్తున్నారు. ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పటికే ఈ మూవీ టైటిల్ లోగో, పోస్టర్ అందరినీ ఆకట్టుకోగా.. తాజాగా మరో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. వరుణ్ సందేశ్ క్యారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు.
Also Read: Navneet Kaur: ఈసీ సీరియస్ .. అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ పై పోలీసు కేసు.. అసలేంజరిగిందంటే..?
ఈ పోస్టర్‌లో వరుణ్ సందేశ్ అమాయకంగా కనిపిస్తుండగా.. బ్యాక్ గ్రౌండ్‌లో ఓ ముసుగు వ్యక్తి రూపం కనిపిస్తోంది. పోస్టర్‌ను తిప్పి చూస్తే.. న్యాయ దేవత విగ్రహం, వెనుక ముసుగు ధరించిన వ్యక్తిని చూపించారు. ఆ ముసుగు ధరించిన వ్యక్తి ఎవరు..? న్యాయ దేవతను ఎందుకు చూపిస్తున్నారు..? వరుణ్ సందేశ్ పాత్ర ఏంటి..? అనే ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసేలా పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుండగా.. మే 15వ తేదీన నింద టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు.
ఈ సినిమాలో ఆనీ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్దార్థ్ గొల్లపూడి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంతు ఓంకార్ సంగీతం అందిస్తున్నారు. కెమెరామెన్‌గా రమీజ్ నవీత్ పనిచేస్తుండగా.. ఎడిటర్‌గా అనిల్ కుమార్ వ్యవహరిస్తున్నారు.
సాంకేతికబృందం
==> బ్యానర్: ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్
==> రైటింగ్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ : రాజేష్ జగన్నాథం
==> మ్యూజిక్ : సంతు ఓంకార్
==> కెమెరామెన్ : రమీజ్ నవీత్
==> ఎడిటింగ్ : అనిల్ కుమార్
==> క్యాస్టూమ్ డిజైనర్ : అర్చనా రావు
==> సౌండ్ డిజైన్ : సింక్ సినిమా
==> PRO : ఎస్ఆర్ ప్రమోషన్స్ (సాయి సతీష్)
Also Read: YS Sharmila Tears: వైఎస్ జగన్ వ్యాఖ్యలతో కలత.. కన్నీళ్లు పెట్టుకున్న వైఎస్ షర్మిల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter