డైరెక్టర్స్గా కూడా రాణించిన టాలీవుడ్ నటులు వీరే
తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది నటులు, కథానాయకులు దర్శకులుగా కూడా తమను తాము నిరూపించుకోవడానికి ప్రయత్నించారు. అందులో కొందరు సక్సెస్ అయితే.. మరికొందరు సక్సెస్ కాలేదన్నది వాస్తవం. అయినప్పటికీ యాక్టర్స్ మెగాఫోన్ పట్టి డైరెక్షన్ చేయడం అనేది ఆషామాషీ విషయం కాదు. అలాంటి టాలీవుడ్ దర్శకుల గురించి మనం కూడా తెలుసుకుందాం..!
తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది నటులు, కథానాయకులు దర్శకులుగా కూడా తమను తాము నిరూపించుకోవడానికి ప్రయత్నించారు. అందులో కొందరు సక్సెస్ అయితే.. మరికొందరు సక్సెస్ కాలేదన్నది వాస్తవం. అయినప్పటికీ యాక్టర్స్ మెగాఫోన్ పట్టి డైరెక్షన్ చేయడం అనేది ఆషామాషీ విషయం కాదు. అలాంటి టాలీవుడ్ దర్శకుల గురించి మనం కూడా తెలుసుకుందాం..!
[[{"fid":"171844","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
నందమూరి తారకరామారావు - నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు నటుడిగానే కూడా దర్శకుడిగా కూడా రాణించారు. శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, శ్రీ క్రిష్ణ పాండవీయం, తల్లా పెళ్లామా, తాతమ్మ కల, దానవీరశూరకర్ణ, చాణక్య చంద్రగుప్త, అక్బర్ సలీం అనార్కలి, శ్రీ రామపట్టాభిషేకం, చండశాసనుడు, బ్రహ్మర్షి విశ్వామిత్ర లాంటి చిత్రాలకు ఎన్టీఆర్ దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకోవడం విశేషం. ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన "వరకట్నం" చిత్రం 1969లో తెలుగులో జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారం కూడా అందుకుంది.
[[{"fid":"171845","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
కృష్ణ - సూపర్ స్టార్ కృష్ణ కూడా తాను నటించిన అనేక చిత్రాలకు తానే దర్శకత్వం వహించారు. సింహాసనం, శంఖారావం, కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు, కొడుకు దిద్దిన కాపురం, అన్న తమ్ముడు, నాగాస్త్రం, రక్త తర్పణం, మానవుడు దానవుడు లాంటి చిత్రాలకు ఆయనే దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌లో కూడా సింహాసనం, ఇష్క్ హై తుమ్సే చిత్రాలకు కృష్ణ దర్శకత్వం వహించారు.
[[{"fid":"171846","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
ఎస్వీ రంగారావు - లెజెండరీ నటుడు ఎస్వీఆర్ కూడా తన కెరీర్‌లో రెండు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆ రెండు చిత్రాలు (చదరంగం, బాంధ్యవాలు) కూడా ఉత్తమ దర్శకుడిగా ఆయనకు నంది అవార్డును తీసుకురావడం విశేషం.
[[{"fid":"171847","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]
ఆర్ నారాయణమూర్తి - పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి స్వతహాగా ఆయన దర్శకత్వం వహించే చిత్రాలలో ఆయనే హీరోగా నటిస్తుంటారు. ఆయన కథానాయకునిగా నటించి దర్శకత్వం వహించిన చిత్రాలలో దండోరా, ఎర్రసైన్యం, ఊరు మనదిరా, చీమలదండు లాంటి చిత్రాలు సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి.
[[{"fid":"171848","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]
పవన్ కళ్యాణ్ - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2002 సంవత్సరంలో "జానీ" సినిమాతో దర్శకుడిగా మారారు. అయితే సినిమా అనుకున్నంత విజయం సాధించలేకపోయినా.. చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
గిరిబాబు - నటుడు గిరిబాబు కూడా పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. రణరంగం, నీ సుఖమే నేను కోరుకున్నా లాంటి సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు.
రవిబాబు - అల్లరి చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రవిబాబు నటుడిగా కూడా సక్సెస్ అయ్యారు. తాను దర్శకత్వం వహించిన అనసూయ, అమరావతి, అవును చిత్రాలలో విలన్‌గా కూడా ప్రశంసలు పొందారు రవిబాబు.
చిన్నా - రాత్రి, శివ, మనీ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు చిన్నా. 2009లో "ఆ ఇంట్లో" పేరుతో వచ్చిన ఓ హారర్ చిత్రానికి చిన్నా దర్శకత్వం వహించారు.
[[{"fid":"171849","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"6":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"6"}}]]
శ్రీనివాస్ అవసరాల - అష్టాచెమ్మ చిత్రంలో నటుడిగా పరిచయమైన శ్రీనివాస్ అవసరాల, ఊహలు గుసగుసలాడే చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత "జ్యో అచ్యుతానంద" చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు.
వెన్నెల కిషోర్ - వెన్నెల కిషోర్ తన తొలి చిత్రం "వెన్నెల"తో తెలుగు సినీ పరిశ్రమలో హాస్యనటుడిగా స్థిరపడ్డారు. తాను తీసిన జఫ్ఫా, వెన్నెల 1 అండ్ 1/2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.
పోసాని క్రిష్ణమురళి - మాటల రచయితగా, దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన పోసాని క్రిష్ణమురళి నటుడిగా కూడా రాణించారు. మెంటల్ క్రిష్ణ, రాజా వారి చేపల చెరువు లాంటి సినిమాలకు తానే దర్శకత్వం వహించి.. ఆ సినిమాలలో కథానాయకుడిగా కూడా నటించారు.
తనికెళ్ల భరణి - హాస్యనటుడిగా, సహాయ నటుడిగా ఒక గుర్తింపు తెచ్చుకున్న నటుడు తనికెళ్ల భరణి. ఆయన మాటల రచయిత కూడా. ఆయన దర్శకత్వం వహించిన "సిర" లఘుచిత్రం అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో కూడా ప్రదర్శించబడింది. 2012లో ముళ్లపూడి వారి కథానిక "మిథునం"ను సినిమాగా తెరకెక్కించారు భరణి.
ఎమ్మెస్ నారాయణ - హాస్యనటుడిగా ఎమ్మెస్ నారాయణకు టాలీవుడ్‌లో చాలా మంచి స్థానం ఉంది. అలాంటి ఎమ్మెస్ పలు చిత్రాలకు మాటలు కూడా రాశారు. అలాగే 2004లో "కొడుకు" చిత్రానికి దర్శకత్వం వహించారు. కానీ ఆ చిత్రం పెద్దగా ఆడలేదు.
ఏవీఎస్ - హాస్యనటుడు ఏవీఎస్ తన కెరీర్‌లో నాలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. సూపర్ హీరోస్, ఓరి నీ ప్రేమ బంగారం కాను, రూమ్ మేట్స్, కోతిమూక చిత్రాలు అందులో ప్రముఖమైనవి.
జెడి చక్రవర్తి - నటుడు జె.డి.చక్రవర్తి కూడా పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన సిద్ధం, హోమం లాంటి చిత్రాలు జెడికి మంచి పేరును సంపాదించి పెట్టాయి.