బాలనటులుగా టాలీవుడ్‌లో అనేకమంది నటిస్తారు. కానీ కొంతమంది మాత్రమే పెద్దయ్యాక హీరోలుగానూ సక్సెస్ అవుతారు. మహేష్ బాబు దగ్గర నుండి అఖిల్ వరకూ సక్సెస్ బాట పట్టిన హీరోలందరూ కూడా ఒకప్పుడు తెలుగు చిత్రాలలో బాల నటులుగా తమను తాము ప్రూవ్ చేసుకున్న వారే. అలాంటి హీరోల గురించి ఈ రోజు ఈ వ్యాసం మీ కోసం ప్రత్యేకం..!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"171526","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


మహేష్ బాబు - బాలనటుడిగా మహేష్ బాబు నటించిన హిట్ చిత్రాలు అన్నీ ఇన్నీ కావు. కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు, శంఖారావం, ముగ్గురు కొడుకులు, అన్న తమ్ముడు లాంటి చిత్రాల్లో బాలనటుడిగా మహేష్ బాబు తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. చిన్నతనంలోనే అభిమానులను కూడా సంపాదించుకున్నారు. 1999లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన "రాజకుమారుడు" చిత్రంతో మహేష్ హీరోగా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. 


వెంకటేష్ - విక్టరీ వెంకటేష్ 1971లో "ప్రేమ్ నగర్" చిత్రంలో చిన్నప్పటి ఏఎన్‌ఆర్ పాత్రను పోషించారు. ఆ తర్వాత బాలనటుడిగా ఆయన ఏ సినిమాల్లోనూ నటించలేదు. ఆ తర్వాత 1986లో విడుదలైన "కలియుగ పాండవులు" చిత్రంతో హీరోగా మారారు వెంకటేష్. 


[[{"fid":"171528","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


కళ్యాణ్ రామ్ -1989లో విడుదలైన "బాల గోపాలుడు" చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించారు కళ్యాణ్ రామ్. ఆ తర్వాత ఏ సినిమాలోనూ ఆయన బాలనటుడిగా నటించలేదు. 2003లో విడుదలైన "తొలి చూపులోనే" చిత్రంతో హీరోగా మారారు కళ్యాణ్ రామ్. 


[[{"fid":"171529","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


జూనియర్ ఎన్టీఆర్ - గుణశేఖర్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన "రామాయణం" చిత్రం ఎంత పెద్ద హిట్ చిత్రమో మనకు తెలియంది కాదు. ఈ చిత్రంలో శ్రీరాముడిగా జూనియర్ ఎన్టీఆర్ నటన అందరినీ బాగా ఆకట్టుకుంది. అంతకుముందే బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో భరతుడి పాత్రలో కూడా జూనియర్ ఎన్టీఆర్ నటించారు. 2001లో విడుదలైన "నిన్ను చూడాలని" చిత్రంతో హీరోగా టాలీవుడ్‌కి పరిచయమయ్యారు జూనియర్ ఎన్టీఆర్. 


[[{"fid":"171530","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


తరుణ్ - అంజలి, తేజ, మనసు మమత, పిల్లలు దిద్దిన కాపురం లాంటి సినిమాలలో బాల నటుడిగా రాణించిన తరుణ్ కుమార్ "నువ్వే కావాలి" చిత్రంతో 2000లో హీరోగా మారారు. అదేవిధంగా ఉత్తమ బాల నటుడిగా పలుమార్లు నంది అవార్డు కూడా అందుకున్నారు. 


[[{"fid":"171531","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"6":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"6"}}]]


బాలాదిత్య - ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం, అత్తింట్లో అద్దె మొగుడు, అన్న, తీర్పు, లిటిల్ సోల్జర్స్ లాంటి చిత్రాలలో బాల నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు బాలాదిత్య. 2003లో జయ దర్శకత్వంలో వచ్చిన "చంటిగాడు" సినిమాతో హీరోగా మారాడు బాలాదిత్య. ఆ తర్వాత 1940లో ఒక గ్రామం చిత్రంలో ఆయన నటించారు. అదే చిత్రానికి జాతీయ అవార్డు కూడా రావడం గమనార్హం. 


[[{"fid":"171532","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"7":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"7"}}]]


తనీష్  - దేవుళ్లు, మన్మధుడు వంటి చిత్రాల ద్వారా బాలనటుడిగా మంచి పేరు తెచ్చుకున్న తనీష్ "నచ్చావులే" చిత్రంతో హీరోగా తన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత రైడ్, మేం వయసుకు వచ్చాం వంటి యూత్ ఎంటర్ టైనర్స్‌లో కూడా నటించారు. 


[[{"fid":"171533","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"8":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"8"}}]]


మనోజ్ నందం - ఛత్రపతి సినిమాలో చిన్నప్పటి ప్రభాస్‌గా బాలనటుడు మనోజ్ నటన మీకు గుర్తుండే ఉంటుంది..? ప్రేక్షకుల ప్రశంసలు పొందిన నటన అది. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన మనోజ్ నందం 2012లో "ఒక రొమాంటిక్ క్రైమ్ కథ" సినిమాతో హీరోగా మారారు. 


[[{"fid":"171534","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"9":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"9"}}]]


అఖిల్ - 1994లో విడుదలైన సిసింద్రీ సినిమాలో కేవలం నెలల వయసున్నప్పుడే నటించిన ఘనత అఖిల్‌కే దక్కుతుంది. 2014లో "మనం" చిత్రంలో చిన్న కెమియో రోల్‌లో కనిపించిన అఖిల్, ఆ తర్వాత 2015లో "అఖిల్" చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యారు.


[[{"fid":"171535","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"10":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"10"}}]]


నాగ అన్వేష్ - ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా తన అల్లరితో ఆకట్టుకున్న నాగ అన్వేష్, స్వయానా నిర్మాత సింధూరపువ్వు క్రిష్ణారెడ్డి తనయుడు. 2014లో వినవయ్యా రామయ్య చిత్రంతో హీరోగా మారారు.