Tollywood Heroine Created a Ruckus at Shooting Spot: సాధారణంగా హీరోయిన్లు అంటేనే సినిమా సెట్ లో చాలా గౌరవం ఉంటుంది.  వారికి మాత్రమే కాకుండా హీరోయిన్ తల్లి అలాగే హీరోయిన్ తో ఎవరు వస్తే వాళ్ళకి కూడా స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇదే విషయాన్ని చాలా సినిమాల్లో చాలా వ్యంగ్యంగా చూపిస్తూ వచ్చారు. అయితే ఈ మధ్య కాలంలో హీరోయిన్ల ప్రాధాన్యత బాగా పెరిగిపోవడంతో. వాళ్లని కూడా హీరోలతో సమానంగా చూస్తూ చూస్తున్నారు దర్శక నిర్మాతలు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ ఇవ్వడం లేదు కానీ ప్రాధాన్యత విషయంలో మాత్రం హీరోల కంటే ఎక్కువగానే చూస్తున్నారని చెప్పాలి. ఒక్కొక్క హీరోయిన్ తన పర్సనల్ అసిస్టెంట్లు, హెయిర్ డ్రెస్సర్, మేకప్ అసిస్టెంట్, మేకప్ మ్యాన్, కాస్ట్యూమ్ డిజైనర్ ఇలా రకరకాల పేర్లతో సుమారు 12 నుంచి 15 మందిని తనతో తీసుకు వస్తుంది అంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఒక హీరోయిన్ టాలీవుడ్ లో ఒక సినిమా యూనిట్ కి చుక్కలు చూపించినట్లుగా తెలుస్తోంది ఇప్పటికే అనేక రకాల కారణాలతో సినిమా షూటింగులు ఆగిపోయి ఈ మధ్యనే షూటింగ్ లు మొదలుపెట్టి అంతా బాగానే నడుస్తుందని భావిస్తున్న దర్శక నిర్మాతలకు ఆమె ప్రవర్తన ఒక్క విధంగా షాక్ కలిగించిందట.


అసలు విషయం ఏమిటంటే టాలీవుడ్ లో ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ లో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ ఉదయాన్నే 6:00 కల్లా సెట్ లో ఉండాల్సిందట. విత్ మేకప్ 6:00 కల్లా సెట్ లో రెడీగా ఉంటే సూర్యోదయం షాట్ ఆమె మీద తీయాలని దర్శకుడు భావించాడు. అయితే సదరు హీరోయిన్ 20 నిమిషాలు లేటుగా సినిమా సెట్ కు వచ్చిందట. అప్పటికి సూర్యోదయం జరిగిపోవడంతో ఆరోజు ఆ షాట్ తీయలేదనే బాధతో సదరు హీరోయిన్ అసిస్టెంట్ మీద దర్శకుడు విరుచుకుపడ్డాడట.


తన బాధంతా చెప్పి ఇప్పుడు మీకోసం మరొక రోజు వేస్ట్ చేయాలి అన్నట్లుగా మాట్లాడాడట ఈ విషయాన్ని అసిస్టెంట్ తీసుకువెళ్లి హీరోయిన్ వద్దకు మోసారట. దీంతో హీరోయిన్ ఈ విషయాన్ని తనకు జరిగిన అవమానంగా భావించి దర్శక నిర్మాతలకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. వెంటనే వెళ్లి ఆమె తనకు కేటాయించిన క్యారవాన్ లోపలికి వెళ్లి డోర్ లాక్ చేసుకుందట. తలనొప్పిగా ఉందనే కారణం చెప్పి సుమారు నాలుగు గంటల పాటు హీరోయిన్ అదే క్యారవాన్ లోపలే ఉండిపోయిందట ఆమె కారణంగా సినిమా షూటింగ్లో ఒక రోజు మొత్తం వృధా అయ్యింది.


ఈ విషయం తెలిసి నిర్మాత, దర్శకుడు సినిమా యూనిట్ మొత్తం ఆమెకు సారీ చెప్పారట. సారీ చెప్పడమే కాదు ఒక రకంగా ఆమె బయటికి రావాల్సిందిగా అడుక్కుంటే అప్పటికి ఆమె ఇగో సాటిస్ఫై అయ్యి ఆ తర్వాత బయటకు వచ్చి షూట్ లో పాల్గొన్నదట. ఈ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.


Also Read: Shweta Basu Prasad Hot Photos: వ్యభిచారం కేసులో పట్టుబడిన శ్వేతాబసు ప్రసాద్ ఇప్పుడెలా ఉందో చూశారా?


Also Read: Kantara: మరో రికార్డు బద్దలు కొట్టిన కాంతార, రజనీకాంత్, యష్ సరసన రిషబ్ శెట్టి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook