జులైలో ప్రేక్షకులను అలరించే కొన్ని వైవిధ్యమైన సినిమాలు వచ్చేస్తున్నాయి. వాటి వివరాలు ఏమిటో మనం కూడా తెలుసుకుందాం..!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


పంతం (జులై 5) - గోపీచంద్, మెహ్రీన్ జంటగా కె.చక్రవర్తి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని రాధామోహన్ నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. బలుపు, పవర్, జై లవకుశ లాంటి యాక్షన్ సినిమాలకు స్క్రీన్ ప్లే రాసిన చక్రవర్తి తొలిసారిగా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా తన సత్తా చాటనున్నారు. 



ఆటగాళ్లు (జులై 5) - పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న సరికొత్త చిత్రం “ఆటగాళ్లు”. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై వాసిరెడ్డి రవీంద్ర నిర్మిస్తున్న ఈ చిత్రంలో నారారోహిత్, జగపతిబాబులు టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. “గేమ్ విత్ లైఫ్” అనే ట్యాగ్ లైన్‌తో  ఇంటెలిజంట్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న  ఈ చిత్రానికి  పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్నారు.



తేజ్ (జులై 6) - సాయి ధరం తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎ.కరుణాకరన్ దర్శకత్వం వహిస్తున్నారు. డార్లింగ్ స్వామి డైలాగ్స్ రాయగా.. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానరుపై కే.ఎస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 



విజేత (జులై 12) - మెగాస్టార్ చిరంజీవి అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న తొలి సినిమా ‘విజేత’ . 1985లో చిరంజీవి న‌టించిన సినిమా టైటిల్ ఇది. లైటింగ్ అప్ స్మైల్స్ ఆన్ అద‌ర్స్ ఫేసెస్ ఈజ్ ఆల్సో ఎ స‌క్సెస్ అనేది ట్యాగ్ లైన్. అంటే ఇత‌రుల మొహాల్లో వెలుగు చూడ‌టం కూడా విజ‌య‌మే అని అర్థం. అందుకే క‌థ‌కు తగట్టుగా ఈ చిత్రానికి విజేత అనే టైటిల్ పెట్టారు. సాయి కొర్రపాటి నిర్మాత‌గా ఈ సినిమా వస్తోంది. రాకేశ్ శశి ఈ చిత్రానికి దర్శకుడు. మాళ‌విక నాయర్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రానికిబాహుబ‌లి ఫేమ్ సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండ‌టం విశేషం.



చినబాబు (జులై 13)  -తమిళ, తెలుగు భాషల్లో సమానమైన క్రేజ్ అండ్ స్టార్ డమ్ కలిగిన సూర్య, కార్తీ బ్రదర్స్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా “చినబాబు”. తమిళనాట 2డి ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై తమ్ముడు కార్తీ హీరోగా రూపొందిస్తున్న “కుట్టి సింగం”ను తెలుగులో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై “చినబాబు”గా రూపొందిస్తున్నారు మిర్యాల రవీందర్ రెడ్డి. కార్తీ సరసన సయేషా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రియ భవాని శంకర్, సత్యరాజ్, భానుప్రియలు కీలకపాత్రలు పోషిస్తున్నారు.



ఆటగదరా శివ (జులై 14) - ప‌వ‌ర్‌, లింగా, బ‌జ‌రంగీ భాయీజాన్‌ వంటి భారీ చిత్రాల నిర్మాత రాక్‌లైన్ వెంక‌టేశ్ నిర్మిస్తోన్న తాజా చిత్రం ఆట‌గ‌ద‌రా శివ‌. రాక్‌లైన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రూపొందిస్తున్నారు.  ఆ న‌లుగురు, మ‌ధు మాసం, అంద‌రి బంధువ‌య‌తో ప్రేక్షకుల భావోద్వేగాల‌ను స్పృశించిన సెన్సిటివ్‌ ద‌ర్శకుడు చంద్ర సిద్దార్థ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఉద‌య్ శంక‌ర్ క‌థానాయ‌కుడు. జూలై 14న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. స‌మ‌యానికి వ‌చ్చేది దేవుడు కాదు… య‌ముడు అనే డైలాగ్‌తో మొద‌లైన ట్రైల‌ర్ ప్రేక్షకులను ఆక‌ట్టుకుంటోంది.



సాక్ష్యం (జులై 20)-టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీవాస్ – యంగ్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా “సాక్ష్యం” అనే డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన సెన్సేషనల్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా నిర్మిస్తున్నారు.



లవర్ (జులై 20)-తొలి చిత్రం ఊయ్యాల జంపాల‌తో స‌క్సెస్‌ఫుల్ హీరోగా కెరీర్‌ను స్టార్ట్‌ చేసిన యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్. వ‌రుస విజ‌యాల‌తో తెలుగు ప్రేక్షకులందరికీ చాలా ద‌గ్గర‌య్యారు. ఇప్పుడు స‌క్సెస్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మాణ సారధ్యం లో శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై `ల‌వ‌ర్‌` సినిమాలో న‌టిస్తున్నారు. `అలా ఎలా?` వంటి సూప‌ర్ హిట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌తో ఆక‌ట్టుకున్న ద‌ర్శకుడు అనీశ్ కృష్ణ‌, వెంట‌నే సినిమా చేసేయాల‌నే ఆలోచ‌న‌తో కాకుండా హిట్ సినిమా తీయాల‌ని వెయిట్ చేసి మంచి క‌థను త‌యారు చేసుకున్నారు. మంచి క‌థ‌కు త‌గ్గట్లు టెస్ట్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు,  యంగ్ హీరో త‌రుణ్ సినిమాకు చ‌క్కగా కుదిరారు.  ఈ సినిమా ప్రేమ‌లోకి కొత్త కోణాల‌ను ట‌చ్ చేసేలా తెర‌కెక్కుతుంది. ఈ చిత్రం ద్వారా రిద్ది కుమార్ హీరోయిన్‌గా ప‌రిచయం చేస్తున్నారు. స‌మీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండ‌గా.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ వ‌ర్క్ చేస్తున్నారు.