Monsoon Tourist Spots Kerala: వర్షాకాలంలో కేరళలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు ఇవే!
Monsoon Tourist Spots Kerala: భారతదేశంలోని ప్రముఖ టూరిస్ట్ ప్రదేశాల్లో కేరళ ఒకటి. ప్రతి ఏటా ఈ రాష్ట్రాన్ని సందర్శించే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. దానికి కారణం ఇక్కడ ఉన్న అందమైన ప్రదేశాలు. అయితే వర్షాకాలంలో కేరళలో ఏ ప్రదేశాలు సందర్శించడానికి అనువుగా ఉంటాయో తెలుసుకుందాం.
Monsoon Tourist Spots Kerala: కేరళను 'గాడ్స్ ఓన్ కంట్రీ' అంటారు. ఆరేబియా సముద్ర తీరాన ఉన్న ఈ రాష్ట్రం ఎంతో అందంగా ఉంటుంది. ఈ స్టేట్ కొబ్బరి తోటలు, కాఫీ తోటలు, ప్రకృతి అందాలతో అలరారుతూ ఉంటుంది. ఇక్కడ చూడటానికి ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. అందుకే పర్యాటకులు ఎక్కువగా ఇక్కడకు వస్తూంటారు. సౌత్ ఇండియాలో బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్స్ లో ఇది ఒకటి. వర్షాకాలం రాబోతుంది. ఈ సమయంలో కేరళలో సందర్శించాల్సిన ప్రదేశాలేంటో తెలుసుకుందాం.
1.అలెప్పి
అలప్పుజ (అలెప్పి)ని "తూర్పు వెనిస్" అని పిలుస్తారు. బ్యాక్ వాటర్స్ మరియు వేలాది హౌస్ బోట్లకు ఇది ప్రసిద్ధి. బ్యాక్‌వాటర్‌లో హౌస్ బోటింగ్ చేయడం మంచి థ్రిల్లింగ్ ను ఇస్తుంది. హౌస్‌బోట్‌లను స్థానికులు కెట్టువల్లమ్ అని పిలుస్తారు. నీటిపై నడిచే ఇల్లు అని దీని అర్థం. అప్పట్లో ఈ పడవల ద్వారా టన్నుల కొద్దీ బియ్యం మరియు సుగంధ ద్రవ్యాలను రవాణా చేసేవారట. ఈ బ్యాక్ వాటర్స్ ను చూడటానికి ప్రపంచ నలుమూలల నుండి టూరిస్టులు వస్తూ ఉంటారు. వర్షాకాలంలో చూడటానికి ఇది మంచి ప్లేస్.
2. అతిరప్పిల్లి జలపాతం
అతిరప్పిల్లి జలపాతాన్ని "నయాగ్రా ఆఫ్ ఇండియా" అని పిలుస్తారు. ఇది సముద్ర మట్టానికి 1000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ జలపాతం 100 మీటర్లు (330 అడుగులు) విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్ లు కూడా ఎక్కువగానే జరుగుతాయి. బహుబలి సినిమాలోని చాలా సన్నివేశాలు ఇక్కడే తీశారు. ఈ వాటర్ పాల్ ను చూడటానికి చాలా మంది పర్యాటకులు వస్తారు.
3. వాయనాడ్
వాయనాడ్ నగరం తమిళనాడు మరియు కేరళ సరిహద్దుకు సమీపంలో ఉంది. ఇది చాలా అందమైన ప్రాంతం. ఎక్కువ టూరిస్టులు సందర్శించే ప్రదేశాల్లో ఇది ఒకటి. ఇక్కడ వయనాడ్ వన్యప్రాణుల అభయారణ్యం, ఎడక్కల్ గుహలు ఉన్నాయి.
Also Read: Beautiful Beaches In India: ఇండియాలో ఎప్పటికైనా సరే చూసి తీరాల్సిన బ్యూటీఫుల్ బీచ్‌లు
4. బెకల్
కేరళ తూర్పు తీరంలో ఒక చిన్న కుగ్రామం బేకల్. ఈ ప్రాంతం అద్భుతమైన బీచ్, ఊగిసలాడే తాటి చెట్లు, బ్యాక్ వాటర్స్ మరియు హిల్ స్టేషన్లకు ప్రసిద్ధి.
5. మరారికులం
అలెప్పి నుండి 12 కిలోమీటర్లు మరియు కొచ్చి నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం మరారికులం. ఈ ప్రాంతం ఫిషింగ్ కు ప్రసిద్ధి. ఇక్కడకు వచ్చే టూరిస్టులను ఫిషింగ్ ట్రిప్‌కు తీసుకెళతారు.
Also Read: Viral: ఆర్డర్ చేసిన నాలుగేళ్లకు డెలివరీ.. షాక్ లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook