యూపీఎస్సీ పరీక్షల్లో సత్తా చాటాలని భావిస్తున్నారా...! అందుకే స్మార్ట్ ఫోన్ సాంకేతికతను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారా.. అయితే ఇంకెందుకు ఆలస్యం.. ఈ యాప్స్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

*ఆన్ లైన్ త్యారి - ఈ యాప్‌లో వివిధ కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం స్టడీ మెటీరియల్‌ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ అధునాతన వెబ్ మరియు మొబైల్ యాప్ ప్లాట్ ఫారంలో ఎన్నో కాంపిటీటివ్ బిట్స్, సమాధానాలు అందుబాటులోకి తీసుకొచ్చారు యాప్ నిర్వాహకులు.


*క్లియర్ ఐఏఎస్ - భారతదేశంలోని నెంబర్ వన్ సివిల్స్ ప్రిపరేషన్ యాప్స్‌లో తనదైన శైలిలో దూసుకెళ్తున్న యాప్ ఇది. ఈ యాప్‌లో సివిల్స్ విజేతల ఇంటర్వ్యూలతో పాటు ఏ విధంగా పరీక్షకు ప్రిపేర్ అవ్వాలి? గైడెన్స్ ఎలా పొందాలి? లాంటి విషయాలకు సమాధానాలు పొందుపరిచారు. అలాగే ఈ యాప్ ద్వారా ఆన్ లైన్ మాక్ టెస్టులు కూడా రాయవచ్చు. 


*సివిల్స్ డైలీ - ఈ యాప్ ద్వారా లేటెస్ట్ కరెంట్ ఎఫైర్స్, జీకే బిట్స్ మొదలైన వాటిని డైలీ ఫ్లాష్ కార్డుల రూపంలో పొందవచ్చు. టాపిక్ వైస్‌గా సిలబస్‌ను వర్గీకరించి ఈ యాప్‌లో నిక్షిప్తం చేయడం జరిగింది. 


*యూఎన్ అకాడమి - ఈ యాప్‌లో ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా చేయాలన్న అంశంపై వీడియో ట్యుటోరియల్స్ ఉన్నాయి. అలాగే ప్రతీ టాపిక్‌ను మీరు కోరిన భాషలో ఈ యాప్ ద్వారా చదువుకోవచ్చు.


*బైజు - 2011 నుండి యూపీఎస్సీ అభ్యర్థులు ఈ యాప్‌ను అనుసరిస్తున్నారు. ఫన్నీ టీచింగ్ మెథడ్స్ ద్వారా విద్యార్థులకు, అభ్యర్థులకు ఆసక్తిని కలిగించడం ఈ యాప్ విశేషం. అయితే ఇది పెయిడ్ యాప్. ఈ యాప్ వాడడానికి కొంత సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. 


*ఐఏఎస్ 100 - ఈ యాప్‌లో పాత ప్రశ్నాపత్రాలతో పాటు లేటెస్ట్ ప్రశ్నాపత్రాలు, వాటికి సమాధానాలు కూడా లభిస్తున్నాయి. ఈ యాప్ నిర్వాహకులు డిస్టెన్స్ ప్రోగ్రామ్ ద్వారా కూడా ఔత్సాహికులకు శిక్షణను అందిస్తున్నారు.


*మృనాల్ - వీడీయో పాఠాలు చెప్పడం ఈ యాప్ ప్రత్యేకత. గత రెండు సంవత్సరాలుగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ యాప్‌‌ను పలువురు టాపర్స్ కూడా వినియోగించుకున్నారని అంటూ ఉంటారు.


*ఐఏఎస్ బాబా - సివిల్స్ అభ్యర్థుల కోసం ఐఐటి, ఐఐఎం విద్యార్థులు తయారుచేసిన ఈ యాప్ కూడా స్మార్ట్ లెర్నింగ్ ప్రక్రియకు పెద్దపీట వేస్తుంది. ప్రజాదరణ పొందిన యాప్‌లలో ఇది కూడా ఒకటి.


*విజన్ ఐఏఎస్  - ప్రముఖ విద్యావేత్తలు అందరూ కలిసి నడుపుతున్న ఈ యాప్‌లో సివిల్స్ అభ్యర్థులకు సలహాలు, సూచనలు అందివ్వడంతో పాటు తాజా సమాచారం కూడా అందిస్తుంది.


*నాలెజ్ - జనరల్ స్టడీస్, కరెంట్ ఆఫైర్స్ మొదలైనవాటిలో నిష్ణాతులను చేయుటకు లైవ్ అప్డేట్స్ అందించే వినూత్న యాప్ ఇది. సివిల్స్ అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.