హారర్ సినిమాలు అంటే మీకు అమితమైన ఇష్టమా..? తెలుగులో విడుదలయ్యే ప్రతీ హారర్ చిత్రం కూడా చూస్తుంటారా..? నిజం చెప్పాలంటే.. దెయ్యాలు, భూతాలను ప్రధాన కథా వస్తువుగా తీసుకొని తీసే ఈ హారర్ చిత్రాల్లో సూపర్ హిట్‌గా  నిలిచిన చిత్రాలు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి చిత్రాలలో కొన్ని వాటిని గురించి మనం కూడా తెలుసుకుందాం..!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"173189","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


జగన్మోహిని - జానపద బ్రహ్మగా ప్రసిద్ధుడైన విఠలాచార్య ఈ సినిమాను 1978లో నిర్మించి, తానే స్వయంగా దర్శకత్వం వహించారు. నరసింహరాజు, జయమాలిని, ప్రభ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించారు. పూర్తి స్థాయి హారర్ చిత్రంగా అప్పట్లోనే ఈ చిత్రం ఆదరణ పొంది సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. టెక్నాలజీ కూడా పెద్దగా లేని ఆ రోజుల్లో విఠలాచార్య చేసిన పలు కెమెరా ట్రిక్స్ కోసం ఈ చిత్రాన్ని కచ్చితంగా చూడవచ్చు. 


[[{"fid":"173190","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


కాష్మోరా - యండమూరి వీరేంద్రనాథ్ కలం నుండి జాలువారిన "తులసి" నవల ఆధారంగా 1986లో ఎన్ బి చక్రవర్తి దర్శకత్వం వహించిన చిత్రం "కాష్మోరా". చేతబడి లాంటి మూఢనమ్మకాలపై అప్పట్లో తీసిన ఈ చిత్రం ఎన్నో చర్చలకు కూడా దారి తీసింది. సైన్స్ ప్రాముఖ్యతను గురించి కూడా ఈ చిత్రంలో దర్శకుడు చెప్పడానికి ప్రయత్నించడం గమనార్హం. రాజేంద్రప్రసాద్ ఈ చిత్రంలో దార్కా అనే ఓ మాంత్రికుడి పాత్రలో కనిపిస్తారు. 


[[{"fid":"173191","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


రాత్రి - 1992లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన "రాత్రి" చిత్రం కల్ట్ క్లాసిక్ చిత్రంగా నిలిచింది. ఇందులో రేవతి, ఓంపురి, అనంత్ నాగ్ మొదలైన వారి నటన సినిమాకే హైలెట్ అని చెప్పవచ్చు. హారర్ చిత్రమైనా చాలా సహజమైన రీతిలో తీయడానికి దర్శకుడు ప్రయత్నించారు. 


[[{"fid":"173192","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


మంత్ర - 2007లో తులసీ రామ్ దర్శకత్వంలో ఛార్మీ ప్రధాన పాత్రలో నటించిన "మంత్ర" చిత్రం కూడా సూపర్ హిట్ హారర్ చిత్రంగా నిలిచింది. ఇదే చిత్రంలో నటనకు గాను ఛార్మీ కౌర్ 2007లో ఉత్తమ నటిగా నంది అవార్డు కూడా అందుకున్నారు. ఇదే చిత్రానికి 2015లో సీక్వెల్ కూడా తీయడం జరిగింది. 


[[{"fid":"173193","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


ప్రేమకథా చిత్రమ్ - 2013లో వచ్చిన హారర్ కామెడీ సినిమా "ప్రేమకథా చిత్రమ్" బ్లా్క్ బస్టర్ చిత్రంగా నిలిచింది. సుధీర్ బాబు, నందిత హీరో హీరోయిన్లుగా నటించినప్పటికీ.. సప్తగిరి కామెడీ సినిమాకి ప్రధాన అసెట్‌గా నిలిచింది. ఈ చిత్రంతో సప్తగిరి కూడా మంచి కమెడియన్‌గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. మారుతి ఈ చిత్రాన్ని నిర్మించారు. 


[[{"fid":"173194","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"6":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"6"}}]]


అవును - 2012లో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన "అవును" చిత్రం హారర్ చిత్రాలలోనే ఒక స్పెషల్ చిత్రమని చెప్పుకోవచ్చు. కెప్టెన్ రాజు అనే ఓ ఆగంతకుడి ఆత్మ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ బ్యానరుపై రవిబాబు  నిర్మించిన ఈ చిత్రానికి సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకుంది. ఇదే చిత్రానికి తర్వాత సీక్వెల్ కూడా వచ్చింది. 


[[{"fid":"173195","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"7":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"7"}}]]


రక్ష  - 2008లో వచ్చిన "రక్ష" అనే హారర్ చిత్రానికి వంశీక్రిష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించగా.. ఆజామ్ ఖాన్, రామ్ గోపాల్ వర్మ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. యండమూరి నవల "తులసిదళం" ప్రేరణతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  జగపతిబాబు ఈ చిత్రంలో హీరోగా నటించారు. 


[[{"fid":"173196","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"8":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"8"}}]]


ఆ ఇంట్లో - 2009లో వచ్చిన "ఆ ఇంట్లో" సినిమాకి నటుడు చిన్నా దర్శకత్వం వహించారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాగానే వసూళ్లను రాబట్టింది. కానీ.. ఈ చిత్రం తర్వాత చిన్నా ఏ ఇతర చిత్రానికి కూడా దర్శకత్వం వహించలేదు. 


[[{"fid":"173197","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"9":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"9"}}]]


రాజు గారి గది - ఓంకార్ దర్శకత్వంలో 2015లో తెరకెక్కిన చిత్రం "రాజు గారి గది". పూర్తిస్థాయి హారర్ కామెడి చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఓంకార్ సోదరుడు ఆశ్విన్ బాబు కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రం బాగానే సక్సైయింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా 2017లో "రాజు గారి గది 2" చిత్రాన్ని తీశారు ఓంకార్. ఈ చిత్రంలో నాగార్జున, సమంత నటించారు. 


[[{"fid":"173198","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"10":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"10"}}]]


ఆనందో బ్రహ్మ- 2017లో విడుదలైన హారర్ కామెడీ చిత్రం "ఆనందో బ్రహ్మ"కి మహి వి రాఘవ్ దర్శకత్వం వహించారు. భయానికి నవ్వంటే భయం అనే క్యాప్షన్‌తో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌నే సొంతం చేసుకుంది. మనుష్యులను చూసి దెయ్యాలు భయపడితే అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తీశారు.