ఆదర్శ గురువు పాత్రలు పోషించిన సినీ నటులు వీరే..!
గురుదేవోభవ అన్నారు పెద్దలు. గురువే దైవం. గురువే విద్యార్థి జీవితానికి బాటలు వేసే గొప్ప మనిషి. అలాంటి గురువు పాత్రలను పోషించిన సినీ నటులు చాలామంది ఆయా పాత్రలలో ఒదిగిపోయి నటించారు.
గురుదేవోభవ అన్నారు పెద్దలు. గురువే దైవం. గురువే విద్యార్థి జీవితానికి బాటలు వేసే గొప్ప మనిషి. అలాంటి గురువు పాత్రలను పోషించిన సినీ నటులు చాలామంది ఆయా పాత్రలలో ఒదిగిపోయి నటించారు. ఉపాధ్యాయులుగా, ప్రొఫెసర్లుగా, కోచ్‌లుగా కొందరు నటులు సినిమాల్లో పోషించిన క్యారెక్టర్లు ఎవరికైనా ఎప్పటికైనా గుర్తుండిపోవాల్సిందే. ఇప్పటి వరకూ విడుదలైన తెలుగు సినిమాల్లో అలాంటి ఆదర్శ గురువు పాత్రలలో నటించిన పలువురు గురించి మనం కూడా తెలుసుకుందామా..!
[[{"fid":"171393","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ఎన్టీఆర్ - నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు స్కూలు టీచరుగా నటించిన చిత్రం "బడి పంతులు". ఈ చిత్రంలో విద్యార్థులే గురువుకి ఇల్లు నిర్మించి ఇవ్వడం విశేషం. అయితే విద్యార్థుల జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దిన గురువు జీవితమే కుటుంబ కలహాల వల్ల అల్లకల్లోలమైతే.. ఆ జఠిల సమస్యలను ఆయన ఎలా ఎదుర్కొన్నాడన్నదే చిత్ర కథ. ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటన నభూతో నభవిష్యత్ అన్నరీతిలో ఉందని చెప్పవచ్చు. "భారతమాతకు జేజేలు" అనే సూపర్ హిట్ దేశభక్తి గీతం ఈ చిత్రంలోనిదే. కెవి మహదేవన్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి పి చంద్రశేఖర రెడ్డి దర్శకత్వం వహించారు. ఇదే చిత్రానికి ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు.
[[{"fid":"171394","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
గిరీష్ కర్నాడ్ - 1983లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చిత్రం "ఆనంద భైరవి". తాను నేర్చుకున్న నాట్యకళ అంతరించిపోకూడదు అని భావించి.. అదే విద్యకు సంబంధించిన వారసత్వాన్ని కొనసాగించడం కోసం ఓ గిరిజన బాలికకు నాట్యాన్ని నేర్పించే గురువు కథ ఇది. ఈ చిత్రంలో నాట్యాచార్య భాగవతుల వెంకట రామశర్మ పాత్రలో నటుడు గిరీష్ కర్నాడ్ నటించారు.
[[{"fid":"171395","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
చిరంజీవి - మెగాస్టార్ చిరంజీవి కాలేజీ లెక్చరర్‌గా నటించిన చిత్రం "మాస్టర్". గాడి తప్పుతున్న విద్యార్థుల జీవితాలను ఒక మాస్టర్ ఎలా దారికి తెచ్చాడన్నదే ఈ చిత్రకథ. 1997లో విడుదలైన ఈ చిత్రానికి సురేష్ క్రిష్ణ దర్శకత్వం వహించారు. అలాగే "ఠాగూర్" చిత్రంలో కూడా చిరంజీవి కాలేజీ ప్రొఫెసర్ పాత్ర పోషించారు. కాలేజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తూనే.. ఒక అవినిరోధక సంఘాన్ని నడిపే వ్యక్తిగా చిరంజీవి పోషించిన పాత్రకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
[[{"fid":"171396","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]
వెంకటేష్ - "సుందరకాండ" చిత్రంలో తెలుగు లెక్చరర్‌గా విక్టరీ వెంకటేష్ నటించారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ విద్యార్థిని తనతో ప్రేమలో పడ్డానని చెప్పినప్పుడు ఆ గురువు ఎలా స్పందించాడన్నదే చిత్రకథ. అలాగే "గురు" చిత్రంలో బాక్సింగ్ కోచ్‌గా వెంకటేష్ చాలా చక్కటి పాత్రలో నటించారు. బస్తీలో తిరిగే ఓ పేదింటి అమ్మాయికి బాక్సింగ్‌లో శిక్షణ ఇచ్చి.. ఆమెను ఉన్నత శిఖరాలకు చేర్చడానికి ఓ గురువు ఎంతగా కష్టపడ్డాడన్నదే చిత్రకథ.
[[{"fid":"171397","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]
రాజేంద్రప్రసాద్ - "ఓనమాలు" చిత్రంలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ రిటైరైన తెలుగు మాస్టారి పాత్రలో నటించారు. రిటైర్ అయ్యాక తన కొడుకుతో కలిసి అమెరికా వెళ్లిపోయిన నారాయణ రావు అనే మాస్టారు చాలా సంవత్సరాల తర్వాత తాను చదువు చెప్పిన పల్లెటూరి స్కూలుని చూడడానికి వస్తాడు. అయితే పూర్తిగా పల్లెలో మారిపోయిన జీవన స్థితిగతులను చూసి ఆశ్చర్యపోతాడు. ఈ క్రమంలో మళ్లీ తన ఊరిని సంస్కరించడానికి ఆ మాస్టారు ఏం చేశారన్నదే చిత్రకథ.
[[{"fid":"171398","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"6":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"6"}}]]
కమల్ హాసన్ - 1994లో తమిళంలో వచ్చిన "నమ్మవర్" చిత్రానికి అనువాద రూపమే తెలుగులో వచ్చిన "ప్రొఫెసర్ విశ్వం". ఈ చిత్రంలో క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ హిస్టరీ ప్రొఫెసరుగా కమల్ హాసన్ నటించారు. గాడి తప్పుతున్న రమేష్ అనే విద్యార్థి జీవితాన్ని సంస్కరించడానికి ప్రొఫెసర్ విశ్వం తన జీవితాన్ని ఎలా పణంగా పెట్టాడన్నదే ఈ చిత్రకథ. కె.ఎస్. సేతుమాధవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
[[{"fid":"171399","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"7":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"7"}}]]
సుమంత్ - 2011లో విడుదలైన "గోల్కొండ హైస్కూల్" చిత్రంలో సుమంత్ క్రికెట్ కోచ్ పాత్రలో నటించారు. తమ స్కూలు గ్రౌండును ఆక్రమించాలని చూస్తున్న వారిని ఎదుర్కోవడం కోసం.. ఓ పాఠశాలకు చెందిన క్రికెట్, టీమ్ కోచ్ సహాయంతో ఒక గొప్ప టీమ్‌గా ఎలా ఎదిగిందన్నదే చిత్రకథ. ఇంద్రగంటి మోహన క్రిష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
[[{"fid":"171400","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"8":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"8"}}]]
నరేష్ - 1989లో విడుదలైన హాస్యరస ప్రధాన చిత్రం "హై హై నాయకా". జంధ్యాల దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలో నరేష్ తెలుగు మాస్టారి పాత్ర పోషించారు. ఓ విద్యార్థి చేత బూతులు మానిపించడం కోసం.. ఆ చదువు రాని చెడ్డ విద్యార్థిని మంచి విద్యార్థిగా ఓ తెలుగు మాస్టారు ఎలా మార్చాడన్నదే ఈ చిత్రకథ.
[[{"fid":"171401","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"9":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"9"}}]]
కృష్ణుడు - 2012లో విడుదలైన "రామదండు" చిత్రంలో కృష్ణుడు ఫుట్‌బాల్ కోచ్‌గా నటించారు. ఒక విలేజ్ ఫుట్‌బాల్ జట్టును జాతీయ పోటీలకు పంపించడం కోసం ఓ కోచ్ ఎంతగా కష్టపడ్డాడన్నది ఈ చిత్రంలో చూడవచ్చు.
[[{"fid":"171402","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"10":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"10"}}]]
ప్రభుదేవా - 2006లో విడుదలైన "స్టైల్" చిత్రంలో ప్రభుదేవా డ్యాన్స్ మాస్టారుగా నటించారు. ఆయన శిష్యుడిగా రాఘవ లారెన్స్ మరో విభిన్న పాత్ర పోషించారు. వికలాంగుడిగా మారిన ఓ డ్యాన్స్ మాస్టర్ తన ఆశయాన్ని సాధించడం కోసం ఓ శిష్యుడిని ఎలా తయారుచేశాడన్నదే చిత్రకథ.