హైదరాబాద్: ప్ర‌ముఖ హిందీ న‌టుడు, పంజాబీ పాత్ర‌ల్లో ఆకట్టుకున్న మ‌న్మీత్ గైవాల్(32) ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.  కాగా ఈ ఆత్మహత్యకు కారణం ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులతో క‌ల‌త చెంద‌డం వ‌ల్లేనని ప్రాథమికంగా కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే పంజాబ్‌కు చెందిన‌  టీవీ నటుడు ప్ర‌స్తుతం ముంబైలోని ఖ‌ర్గార్‌లో త‌న భార్య‌తో క‌లిసి నివ‌సిస్తున్నాడు. లాక్‌డౌన్ (Lock Down Effect) వ‌ల్ల అన్ని రంగాల‌తో పాటు సినీరంగానికి బ్రేక్ ప‌డిన విషయం తెలిసిందే.. షూటింగ్‌లు ఎక్క‌డికక్క‌డ నిలిచిపోవ‌డంతో ఉపాధి లేక‌ ఆర్థిక క‌ష్టాలు అత‌న్ని వెంటాడాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మ‌న్మీత్ గైవాల్ తీవ్ర మాన‌సిక ఒత్తిడికి లోన‌య్యాడని, ఈ క్ర‌మంలోనే అత‌ను ఉరేసుకుని చ‌నిపోయిన‌ట్లు అత‌ని ఫ్యామిలీ ఫ్రెండ్ మంజీత్ సింగ్ రాజ్‌పుత్ మీడియాకు వెల్ల‌డించాడు. కాగా మ‌న్మీత్ 'ఆదత్ సే మజ్బూర్', 'కుల్దీపాక్' వంటి సీరియల్స్‌లో నటించి ప్రేక్ష‌కాద‌ర‌ణ సొంతం చేసుకున్నాడు. పలు టీవీ కార్యక్రమాలతో పాటు వాణిజ్య ప్రకటనలలో తనదైన శైలిలో ఆకట్టుకుని ముద్ర వేశాడు. మరోవైపు ఈ మధ్య కాలంలో కొన్ని వెబ్ సిరీస్‌కు కూడా సైన్ చేశాడని, కానీ లాక్‌డౌన్ వ‌ల్ల ఆ ప్రాజెక్ట్‌లు ప్రారంభం కాలేదు. ఈ ఆత్మహత్యపై ప్రస్తుతం పొలీసులుపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..