సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు 'జీఎస్టీ' కష్టాలు తప్పేలాలేవు. ఇప్పటికే ఆయనపై ఓ న్యూస్ ఛానల్ డిస్కషన్ లో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆయన హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల ఎదుట కేసుల విచారణ ఎదుర్కొంటున్నారు.  విచారణ సందర్భంగా సినిమా మొత్తం విదేశాల్లోనే చిత్రీకరించనని, తాను స్కైప్ ద్వారా కొన్ని సూచనలు మాత్రమే చేశానని వర్మ చెప్పారు.


ఇదిలా ఉండగా.. ఇప్పుడు మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. 'జీఎస్టీ' చిత్రాన్ని హైదరాబాదులోనే తెరకెక్కించారని ఓ ప్రతిక కథనాన్ని ప్రచురించింది. మియా మాల్కోవా కూడా హైదరాబాదుకు వచ్చిందని.. ఇందుకు సంబంధించిన ఆధారాలన్నీ తమవద్ద ఉన్నాయని చెప్పింది. హైదరాబాదులోని ఓ స్టార్ హోటల్ లో ఈ షాట్ ఫిల్మ్ ని షూట్ చేశారని తెలిపింది. ఒకవేళ ఇదే నిజమైతే రాంగోపాల్ వర్మకు కష్టాలు తప్పనట్టే. ఎందుకంటే భారతదేశంలో పోర్న్ సినిమాలు తీయడం నిషిద్ధం. అంతేకాదు, షూటింగ్ జరిగిన ఆ స్టార్ హోటల్ కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.