'ఫిదా', 'తొలిప్రేమ' వంటి వరుస విజయాలతో ఊపుమీదున్న వరుణ్ తేజ్.. ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నాడు. ఆంటీ గ్రావిటీ పరిస్థితుల్లో అస్ట్రోనాట్స్ ఎలా మ్యానేజ్ చేస్తారు..? లాంటి విషయాలపై అవగాహన తెచ్చుకుంటున్న ఈ కుర్ర హీరో మరో క్రేజీ ప్రాజెక్ట్ కు సిద్దమయ్యాడు. సాగర్ చంద్ర దర్శకత్వంలో తన తదుపరి సినిమా ఉంటుందని ఉగాది సందర్భంగా వరుణ్ తన అభిమానులకు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలే సాగర్ చంద్ర చెప్పిన స్టోరీలైన్ కి ఇంప్రెస్ అయిపోయి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఫాస్ట్ పేజ్ లో ప్రీ ప్రొడక్షన్ బిగిన్ చేసిన సినిమా యూనిట్, ఉగాది సదర్భంగా ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.


14 రీల్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ సినిమాల కన్నా భిన్నంగా ఉండబోతుందని చెప్తున్నారు ఫిల్మ్ మేకర్స్. ‘అప్పట్లో ఒకడుండేవాడు  సినిమాతో యువ దర్శకుడు సాగర్ చంద్ర మంచి పేరు తెచ్చుకున్న సాగతీ తెలిసిందే..! ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్ తో పాటు తక్కిన టెక్నీషియన్స్ ని ఫిక్స్ చేసుకునే పనిలో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్. ఈ సినిమాకి రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలు.