వరుణ్ తేజ్ `అంతరిక్షం` ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
`ఘాజీ` ఫేమ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా అంతరిక్షం నేపథ్యంలో ఓ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.
'ఘాజీ' ఫేమ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా అంతరిక్షం నేపథ్యంలో ఓ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి చిత్రానికి సంబంధించి టైటిల్, మూవీ రిలీజ్ డేట్ ఆగస్టు 15న విడుదలవుతుందని మూడు రోజుల క్రితం మూవీ యూనిట్ తెలిపింది. ఈ క్రమంలోనే 72వ స్వాతంత్ర్య దినోత్సవం రోజున మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు మూవీ టైటిల్ ను రిలీజ్ చేశారు. మూవీ టైటిల్‌ను ‘అంతరిక్షం’ అని ఫిక్స్ చేయగా.. పోస్టర్ లో వరుణ్ తేజ్ అంతరిక్షంలో ఉన్న ఓ ఫొటోను ఫస్ట్ లుక్‌గా రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్టు వైరల్‌గా మారింది.
హాలీవుడ్ స్థాయిలో అత్యుత్తమ సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరో, ఇతర నటులు జీరో గ్రావిటీపై ప్రత్యేక శిక్షణ తీసుకొని నటించారని మూవీ యూనిట్ తెలిపింది. వరుణ్‌తేజ్ సరసన అదితీరావు హైదరీ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై క్రిష్ జాగర్లమూడి, సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందిస్తుండగా.. వి.ఎస్. జ్ఞానశేఖర్ ఛాయా గ్రాహకుడు. డిసెంబర్ 21న చిత్రం విడుదల చేయనున్నారు.
వరుణ్ తేజ్ విక్టరీ వెంకటేష్‌తో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2- ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ అనే సినిమా కూడా చేస్తున్నారు.