రామ్‌చరణ్‌ నటించిన 'రంగస్థలం' సినిమాపై అభిమానులు, ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కిన 'రంగస్థలం' చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో 'చిట్టిబాబు' పాత్రలో చరణ్‌ ఒదిగిపోయాడంటూ అటు ప్రేక్షకులు.. ఇటు సినీ పరిశ్రమ ప్రముఖులు అతని నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూడా 'రంగస్థలం'పై కామెంట్లు చేశారు. 'రంగస్థలం' చిత్రం విజయం పట్ల పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రానా మరియు ఇతర హీరోలు స్పందించిన సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఈ జాబితాలో వెంకటేష్ కూడా చేరిపోయారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ''రంగస్థలం' సినిమా చూశా. చిట్టిబాబుగా చరణ్‌ అద్భుతంగా, పర్‌ఫెక్ట్‌గా ఉన్నారు. పాత్రల్ని ఎంతో ప్రభావవంతంగా రూపొందించిన సుకుమార్‌కు హ్యాట్సాఫ్‌. మైత్రీ మూవీ మేకర్స్‌కు, మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు' అని వెంకీ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.


కాగా.. రాంచరణ్ 'రంగస్థలం' చిత్రం హవా ఐదవ రోజు కూడా కొనసాగింది. 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రంగస్థలం చిత్రం సుమారు 70 కోట్లకుపైగా షేర్ వసూలు చేసినట్లు... త్వరలో వందకోట్ల క్లబ్ లోకి  వెళ్లే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఐదవరోజు తెలుగు రాష్ట్రాల్లో 50కోట్ల మార్క్ ను దాటిందని సమాచారం.