రియల్ లైఫ్‌లో మేన మామా- మేనల్లుళ్లు అయిన వెంకటేశ్, నాగచైతన్య రీల్ లైఫ్ హీరోలుగా కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ 'వెంకీ మామ'కు సంబంధించిన టైటిల్ లోగో విడుదలైంది. ఇప్పటికే వెంకీ, చైతూ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో వెంకీ మామపై అభిమానుల్లో, ఆడియెన్స్‌లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగినట్టుగానే లోగో డిజైన్‌లోనూ ఒకవైపు గ్రామీణ నేపథ్యం, మరోవైపు యుద్ధం నేపథ్యం కనిపించేలా రూపొందించారు. ఇక సినిమా షూటింగ్ అప్ డేట్స్ విషయానికొస్తే, ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న వెంకీ మామ సోమవారం నుంచి రెండో షెడ్యూల్ జరుపుకోనుంది. 


కేఎస్ రవీంద్ర (బాబి) దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వెంకీ మామ'ను ఆగస్ట్ వరకల్లా షూటింగ్ పూర్తిచేసి దసరా కానుకగా సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వెంకీ మామ సినిమాలో వెంకీ సరసన పాయల్, చైతూ సరసన రాశిఖన్నా జంటగా నటిస్తున్నారు.