Kaikala Satyanarayana: హైదరాబాద్‌లో మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ జన్మదిన వేడుకలు జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి..ఆయన ఇంటికి వెళ్లి స్వయంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా కైకాల కుటుంబ సభ్యులు, చిరంజీవి సమక్షంలో సత్యనారాయణ కేక్‌ కట్ చేశారు. అనంతరం ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని మాములు మనిషిగా మారాలని మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్షించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"239097","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


అనంతరం వారి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. చిరంజీవి చూపిన చొరవకు కైకాల సత్యనారాయణ, ఆయన కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. సత్యనారాయణ పుట్టిన రోజున చిరంజీవి ఇంటికి రావడం సంతోషంగా ఉందన్నారు ప్రముఖ నిర్మాత కైకాల నాగేశ్వరరావు. చిరు రాక తమకు ఎంతో భరోసాను ఇచ్చిందన్నారు. మెగాస్టార్ చిరంజీవికి, సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు ప్రత్యేక అనుబంధం ఉంది.


[[{"fid":"239098","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


వీరిద్దరి కాంబినేషన్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వెండి తెరపైన అద్భుతాలు సృష్టించాయి. స్టేట్ రౌడీ, కొదమ సింహం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, యముడికి మొగుడు, బావగారు బాగున్నారా వంటి చిత్రాలు విజయవంతమయ్యాయి. కైకాల సత్యనారాయణ పుట్టిన రోజు వేడుకల్లో ఆయన కుమారులు లక్ష్మీనారాయణ, రామారావుతోపాటు ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు.


Also read:Shiv Sena: ఈసీని నిలువరించండి..సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఉద్దవ్ ఠాక్రే వర్గం..!


Also read:Axar Patel: ఆకాశమే హద్దుగా చెలరేగిన అక్షర్‌ పటేల్..17 ఏళ్ల రికార్డు బద్దలు..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.