విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ !
తెలుగులో వరుస హిట్స్‌తో ఫుల్ జోష్‌మీదున్న విజయ్ దేవరకొండ త్వరలోనే బాలీవుడ్ ఆడియెన్స్‌కి సైతం పరిచయం కానున్నాడని తెలుస్తోంది.
తెలుగులో వరుస హిట్స్‌తో ఫుల్ జోష్‌మీదున్న విజయ్ దేవరకొండ త్వరలోనే బాలీవుడ్ ఆడియెన్స్‌కి సైతం పరిచయం కానున్నాడని తెలుస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన అశ్వనీదత్ నటుడు విజయ్ దేవరకొండతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు ఇటీవలే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. బాలీవుడ్ లో పేరున్న దర్శక ద్వయం రాజ్ నిడమనూరు, కృష్ణ డీకేల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు ఫిలింనగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. 99, షోర్ ఇన్ ది సిటీ, గో గోవా గాన్, డీ ఫర్ దోపిడీ, హ్యాపీ ఎండింగ్, ఏ జెంటిల్‌మేన్ వంటి సినిమాలతోపాటు ప్రస్తుతం థియేటర్లలో ఉన్న హిందీ సినిమా 'స్త్రీ' ఈ దర్శకులు తెరకెక్కించిందే.