Leo First Look Controversy: దొరికేసిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. లియో ఫస్ట్ లుక్ ఆ సినిమా పోస్టర్ అంటూ నెట్టింట్లో రచ్చ!
Leo First Look Controversy in Social Media: విజయ్- లోకేష్ కనగరాజ్ కాంబోలో రూపొందుతున్న సినిమా `లియో`. విజయ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అయితే తాజాగా ఈ పోస్టర్ పై సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తోంది.
Leo First Look Poster Copied..?: దళపతి విజయ్ పుట్టిన రోజు సందర్భంగా లియో ఫస్ట్ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పోస్టర్ ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్.. గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో జోన్ స్నో పోస్టర్ లాగే ఉందని టోలర్స్ మండిపోతున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ అభిమానులకు, నెటిజన్లకు మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తోంది.
డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ క్యారెక్టర్ డిజైన్ చేయడానికి చాలా ఇన్స్పిరేషన్స్ ఉండవచ్చని.. దానిని కాపీ అని అనలేమని విజయ్-లోకేష్ అభిమానులు అంటున్నారు. ఒరిజినల్ క్రియేటర్‌లకు లోకేష్ కనగరాజ్ క్రెడిట్స్ ఇచ్చారా? అని మరోవైపు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. విజయ్ అభిమానులు మరియు నెటిజన్ల మధ్య పోరు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే లియో ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విజయ్‌ని లోకేష్ కనగరాజ్ చూపించిన విధానం పట్ల దళపతి అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.
Also Read: Maa Awara Zindagi Movie Review: మా ఆవారా జిందగీ మూవీ రివ్యూ
సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై లలిత్ కుమార్ నిర్మిస్తున్న లియో చిత్రం దాదాపు పూర్తి కావస్తోంది. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, సంజయ్ దత్, త్రిష, ప్రియా ఆనంద్, మన్సూర్ అలీఖాన్, మిస్కిన్, గౌతం వాసుదేవ్ మీనన్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా రైట్స్ తెలుగులో రూ.25 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల నాగ చైతన్యతో కస్టడీ (Custody) సినిమా తీసిన వెంకట్ ప్రభుతో (Venkat Prabhu) తన కొత్త సినిమాను ప్రకటించారు విజయ్. ఈ మూవీ కోసం విజయ్ కి రూ.200 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారనే వార్త నెట్టింట విపరీతంగా హల్ చల్ చేస్తోంది.
Also Read: Varun Sandesh: హీరో వరుణ్ సందేశ్‌కు గాయాలు, కానిస్టేబుల్ సినిమా షూటింగ్‌లో ప్రమాదం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook