2 రోజుల్లోనే రూ.100 క్లబ్‌లో చేరిన సర్కార్
![2 రోజుల్లోనే రూ.100 క్లబ్‌లో చేరిన సర్కార్ 2 రోజుల్లోనే రూ.100 క్లబ్‌లో చేరిన సర్కార్](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/styles/zm_500x286/public/2018/11/08/175721-sarkar-movie-review-and-collections-100croores-club.jpg?itok=g6bQbu8R)
2 రోజుల్లోనే రూ.100 క్లబ్‌లో చేరిన సినిమా
ప్రముఖ తమిళ హీరో ఇళయ దళపతి విజయ్ నటించిన సర్కార్ సినిమా విడుదలైన తొలి రెండు రోజుల్లోనే కూ.100 కోట్ల క్లబ్‌లో చేరి రికార్డ్ సృష్టించింది. ఇంత వేగంగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాల్లో 'సర్కార్' కేవలం విజయ్ కెరీర్‌లోనే తొలి సినిమా అని మాత్రమే కాకుండా మొత్తం చెన్నై సినీ చరిత్రలోనే ఇదే మొదటిసారి అని అక్కడి తమిళ సినీవర్గాలు చెబుతున్నాయి. ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ చేసిన మూడో సినిమా ఇది.