Hrithika Srinivas: హీరోయిన్‌గా ఆమని కోడలు.. ఈ సినిమాతో తగ్గేదేలే అంటున్న అమ్మడు
Hrithika Srinivas Sound Party Movie: ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించేందుకు సౌండ్ పార్టీ సిద్ధమైంది. ఈ నెల 24న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో చిత్రవిశేషాలను ఆమె మీడియాతో పంచుకున్నారు.
Hrithika Srinivas Sound Party Movie: సంజయ్ శేరి దర్శకత్వంలో బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ హీరోహీరోయిన్స్‌గా తెరకెక్కిన మూవీ సౌండ్ పార్టీ. శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వి, ‘మిర్చి’ ప్రియ తదితరులు ఇతక కీలక పాత్రలు పోషించారు. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో అంచనాలు పెరిగాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ.. నవంబర్ 24వ తేదీన గ్రాండ్‌గా థియేటర్లలో సందడి మొదలు పెట్టనుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా హీరోయిన్ హ్రితిక శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.
సీనియర్ నటి ఆమని మా అత్త కావడంతో తనకు సినిమాలపై ఆసక్తి పెరిగిందని తెలిపింది హ్రితిక. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశానని.. హీరోయిన్‌గా తెలుగులో తనకు ఇది రెండో సినిమా అని చెప్పింది. అల్లంత దూరాన మూవీ తరువాత సౌండ్ పార్టీలో నటించానని తెలిపింది. "డైరెక్టర్ సంజయ్ స్టోరీ ఎక్సైటింగ్‌గా అనిపించింది. ఇది పూర్తిగా ఫన్ ఎంటర్టైనర్ జోనర్. మూవీలో కామెడీ తోపాటు కంటెంట్ కూడా ఉంది.
ఆడియన్స్ కచ్చితంగా ఎంటర్‌టైన్ అవుతారని నాకు నమ్మకం ఉంది. ఈ సినిమాలో నేను సిరి అనే యువతి క్యారెక్టర్ చేశాను. ఇందులో నా పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. క్రికెట్ టీమ్‌లో ధోనీలా నా పాత్ర ఉంటుందని దర్శకుడు అంటుంటారు. మూవీ క్లైమాక్స్‌లో నా పాత్ర ఇచ్చే ఊహించని ట్విస్ట్‌తో ఆడియన్స్ థ్రిల్‌కు గురవుతారు. ఆట చివరలో ఎంఎస్ ధోనీ ఎలా సిక్సర్లు బాదుతాడో.. అలా నా క్యారెక్టర్ ఉంటుందని చెప్పారు. సీరియస్ రోల్ చేసి.. సిచువేషన్ మాత్రం చాలా కామెడీగా ఉంటుంది. నా నిజ జీవితానికి దగ్గరగా ఉంటే పాత్ర చేశాను.
మెయిన్ కాన్సెప్ట్ విషయానికి వస్తే.. అమాయకులైన తండ్రీకొడుకులు సులభంగా డబ్బులు సంపాదించేందుకు ఎలాంటి పనులు చేశారనేది కథ. ఈ పాయింట్‌ను తీసుకుని డైరెక్టర్ గారు చాలా ఫన్నీగా తెరకెక్కించారు. ఈ సినిమాలో బిట్ కాయిన్‌కు కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే ఉంది. హీరోగా చేసిన వీజే సన్నీకి టెలివిజన్‌లో చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. బిగ్ బాస్ షోలో ఎలా జెన్యూన్‌గా.. ఓపెన్‌గా ఉన్నారో.. బయటకూడా అలానే ఉంటారు. సెట్స్‌లో నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇంకా ప్రయోగాత్మక చిత్రాలు చేయాలని ఉంది. నాకు సాయిపల్లవి అంటే ఇష్టం. ఆమె చేసే పాత్రలు చేయాలని నాకు ఉంటుంది. హీరోల విషయానికి వస్తే.. నేచురాల్ స్టార్ నాని అంటే ఇష్టం.." అంటూ హ్రితిక్ శ్రీనివాస్ తెలిపారు.