హాలీవుడ్ రేంజ్లో రజినీకాంత్ `2.o` టీజర్
అదరగొడుతున్న రజినీకాంత్ 2.o టీజర్
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన '2.o' టీజర్ విడుదలైంది. వినాయక చవితి కానుకగా విడుదలైన ఈ వీడియో హాలీవుడ్ స్థాయిలో ఉంది. 3000కు పైగా ప్రపంచ స్థాయి టెక్నీషియన్స్ చేత పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న '2.o' స్టాండర్డ్స్‌ని ఎలివేట్ చేస్తుంది ఈ టీజర్. ఓ టెక్నాలజీ, విలన్ దారుణాలు.. దాన్ని ఎదుర్కొనేందుకు తీసుకొచ్చిన చిట్టి రోబో ఎలా సమస్యను పరిష్కరిస్తుంది అనే నేపథ్యంగా కథ తెరకెక్కినట్లు తెలుస్తోంది.
ఇక టీజర్ విషయానికొస్తే.. 1:29 సెకన్ల నిడివి గల ఈ వీడియోని చూస్తున్నంత సేపు తెరపై ఫాస్ట్‌గా కదిలే గ్రాఫిక్ ఎలిమెంట్స్ ‘వావ్’ అనిపిస్తున్నాయి. శంకర్ దర్శకత్వంలో గతంలో రిలీజైన రోబోకి ఇది మోస్ట్ అప్డేటెడ్ వర్షన్. ఈ టీజర్‌ని కొన్ని థియేటర్స్‌లో 3D ఫార్మాట్‌లో, మిగిలిన చోట్ల 2D ఫార్మాట్‌లో రిలీజ్ చేశారు.
సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటిస్తుండగా.. అమీ జాక్సన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నవంబర్ 29 ప్రపంచ వ్యాప్తంగా '2.o' విడుదలకానుంది. A.R.రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్ చేయగా.. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కించారు. రజినీకాంత్ నటించిన 2.o టీజర్‌ను మీరూ చూడండి..