స్కూల్ టాయిలెట్‌ను చేత్తో శుభ్రంచేసిన ఎంపీ
మధ్యప్రదేశ్‌లోని రేవా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ జనార్దన్ మిశ్రా ఇటీవలే ఒక గ్రామంలో ఓ పాఠశాల టాయిలెట్‌ను శుభ్రపరిచి ఆదర్శంగా నిలిచారు.
మధ్యప్రదేశ్‌లోని రేవా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ జనార్దన్ మిశ్రా ఇటీవలే ఒక గ్రామంలో ఓ పాఠశాల టాయిలెట్‌ను శుభ్రపరిచి ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.
రేవాలోని ఖజువ గ్రామంలో ఓ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటిస్తుండగా, తామంతా బహిర్భూమి నిమిత్తం బయటకు వెళుతున్నామని చెప్పారు. మరుగుదొడ్లు సక్రమంగా లేని కారణంగా వాటిని వినియోగించడం లేదని విద్యార్థులు చెప్పడంతో, పరిశీలించిన ఆయన, ఓ చీపురు పట్టుకుని టాయిలెట్‌ను శుభ్రపరిచారు. తన ఎడమ చేత్తో లోపల కూరుకుపోయిన వ్యర్థాన్ని బయటకు తీశారు. టాయిలెట్ శుభ్రపరుస్తున్న రేవా ఎంపీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.