హైదరాబాద్: అత్యంత ఆదరణ పొందిన వాట్సాప్‌ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తెస్తూ వినియోగదారులను ఉత్సాహపరుస్తుంటుంది. మల్టీ లాగిన్‌ డివైస్‌ సపోర్ట్‌, సెర్చ్‌ బై డేట్‌ ఆప్షన్‌, క్లియరింగ్‌ చాట్‌ ఫీచర్లను తీసుకువచ్చింది. తాజాగా మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అది ఏంటంటే మల్టీ లాగిన్‌ డివైస్‌ సపోర్ట్‌ ఫీచర్‌తో ఒకేసారి వివిధ డివైస్‌లలో వాట్సాప్‌ లాగిన్‌ అయ్యే అవకాశం ఉంటుందని, దీంతో వివిధ డివైస్‌ల నుంచి ఒకే సమయంలో చాట్‌ చేసే అవకాశం కూడా ఉంటుందని ఆ సంస్థ పేర్కొంది. 


Also Read: Earthquake: 3 నిమిషాల వ్యవధిలోనే రెండుసార్లు భూకంపం


ఇదిలాఉంటే చాలామంది ఒక సిస్టమ్‌లో వాట్సాప్‌ లాగిన్ అయితే తర్వాత మరొక డివైజ్‌లో లాగిన్‌ అవ్వాలంటే మునుపటి సిస్టమ్ లో లాగౌట్‌ అవ్వాల్సి ఉంటుంది. అందుకే చాట్‌ విండోస్‌లో సరికొత్త ‘సెర్చ్‌ ఆప్షన్‌‘ తీసుకురాబోతున్నదని డబ్లూఏబేటాఇన్ఫో వెల్లడించినది. సెర్చ్‌ బై డేట్‌ ఆప్షన్‌ను యూజర్లకు పరిచయం చేయబోతున్నామని, ఈ అప్‌డేట్ రావడానికి కొంత సమయం పడుతుందని పేర్కొంది. 
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..