ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్.. ప్రతీ స్మాట్ ఫోన్ లోనూ వాట్సాప్ యాప్.. ఇలా ప్రతి  ఒక్కరూ ఏదో రకంగా వాట్సాప్ వినియోగం చేస్తున్నారు. పర్సనల్ అవసరాల నుంచి వ్యాపార, ఇతర అవసరాల కోసం వాట్సాప్ వినియోగం తప్పని సరిగా మారింది. ఇలాంటి తరుణంలో వాట్సాప్ ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ వస్తోంది. ఇప్పుడు తాజాగా వాట్సాప్ లో సరికొత్త ఫీచర్  అందుబాటులోకి వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సరికొత్త ఫీచన్ ఇదే...


తాజా ఫీజర్ ను అనుసరించి వాట్సాప్ స్టేటస్ లో కనిపించే ఫోటోలు, వీడియోలను సేవ్ చేసే ఛాన్స్ అవకాశం దొరకనుంది. ఇప్పటి వరకూ స్టేటస్‌లో మనకు నచ్చిన ఫోటోలు, వీడియోలను సేవ్ చేసే అవకాశం లేదు... తాజా ఫీచర్ తో ఇక నుంచి ఈ అవకాశాన్ని కల్గుతుంది. అయితే ఇలా సేవ్ చేసుకోవాలంటే సంబంధిత వ్యక్తుల అనుమతి తీసుకోవాలని వాట్సాప్ సంస్థ మెలిక పెట్టింది. అయితే ఈ సేవ్ చేసుకునే సదుపాయం ఆండ్రాయిడ్ ఫోన్‌లోని ఫైల్ మేనేజర్‌పై ఆధారపడి ఉంటుందని కంపెనీ యాజమాన్యం పేర్కొంది.


డౌన్ లోడ్ చేసుకుండిలా...
Step 1 : మీ అండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ఫైల్‌ ( Google file ) లను డౌన్‌లోడ్ చేయండి
Step 2: డౌన్ లోడ్ చేసిన గూగుల్ ఫైల్ ఓపెన్ చేసి ఎగువ ఎడమ మూలలో ఉన్న Menu చిహ్నంపై నొక్కండి
Step 3: అందులో కనిపించే "settings" ఆప్షన్ నొక్కండి మరియు "Show hidden files" ముందు టోగుల్ ఆన్ చేయండి.
Step 4:  ఇలా చేసిన తర్వాత  మీ మొబైల్ ఉన్న ఫైల్ మేనేజర్‌కు వెళ్లండి
Step 5: ఇంటర్ననల్ స్టోరేజ్ > వాట్సాప్> మీడియా> వాట్సాప్ స్టేటస్ పోల్డర్ కు వెళ్లండి
Step 6:  ఆ ఫోల్డర్‌లో మీకు కావలసిన ఫోటో లేదా వీడియోపై నొక్కండి
Step 7: మీరు ఎంచుకున్న అంశం (ఫోట్, వీడియో) ఎక్కువసేపు నొక్కి కాపీ చేయండి
Step 8:  కాపీ చేసి మన ఫోన్‌లోని ఇంటర్నల్ మెమొరీలో మనకు నచ్చిన ఫోల్డర్‌ (కెమెరా, వాట్సాప్ చిత్రాలు, డౌన్‌లోడ్‌లు మొదలైనవి ) లో దాన్ని పేస్ట్ చేయాలి

 


గమనించగలరు..


 మీరు అనుసరించే విధానంలో కొన్ని ఆండ్రాయిడ్ డివైజ్ లో స్వల్ప తేడాలు ఉంటాయి. చాలా మొబైల్ డివైజర్లలో ఫైల్ మేనేజర్ లోని వాట్సాప్ > మీడియా> మీకు కావాల్సిన స్టేటస్ , ఇమేజెస్, ఇలా ఇతర ఫోల్డర్స్ ఉంటాయి.  కాపీ చేసిన వాటిని (వీడియా లేదా ఇమేజ్) మన ఫోన్‌లోని ఇంటర్నల్ మెమొరీలో మీకు నచ్చిన ఫోల్డర్‌లో దాన్ని పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే మొదలెట్టండి మరి.. !!